Covid Symptoms in Kids: చిన్నపిల్లల్లో కరోనా కొత్త లక్షణాలు.. కరోనా వేరియంట్ సులభంగా వ్యాపిస్తోంది..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఈ కొత్త కరోనా వేరియంట్ కేవలం పెద్దల్లో మాత్రమే కాదు.. చిన్నారుల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. పెద్దలు, చిన్నారుల్లో సమానంగా ప్రాణాంతకంగా వైరస్ వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Covid Symptoms in Kids: చిన్నపిల్లల్లో కరోనా కొత్త లక్షణాలు.. కరోనా వేరియంట్ సులభంగా వ్యాపిస్తోంది..

New Covid 19 Variant Infects Kids Easily

Coronavirus symptoms in kids : దేశంలో కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఈ కొత్త కరోనా వేరియంట్ కేవలం పెద్దల్లో మాత్రమే కాదు.. చిన్నారుల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. పెద్దలు, చిన్నారుల్లో సమానంగా ప్రాణాంతకంగా వైరస్ వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ్యుటేట్ స్ట్రయిన్ కరోనా వైరస్‌లు సులభంగా చిన్నారులకు వ్యాపిస్తోందని అంటున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్కూళ్లు, విద్యాసంస్థలు తెరవడంతో పాటు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అనుమతి లేకపోవడం కారణంగా వైరస్ పసిపిల్లలపై విజృంభిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. 8 నెలల నుంచి చిన్నారుల నుంచి 14ఏళ్ల పిల్లల వరకు వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో గరిష్ట స్థాయిలో కరోనా కేసులు ఎక్కువగా పిల్లల్లోనే నమోదయ్యాయి. పెద్దవాళ్ల మాదిరిగా కాకుండా చిన్నారుల్లో కామోర్బడిటీలలో తక్కువగా వైరస్‌కు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత మ్యుటేట్ వైరస్ లు పిల్లల్లోనూ వ్యాపిస్తుండటంతో వారిలో కొత్త కరోనా లక్షణాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

పెద్దవారితో పోలిస్తే.. చిన్నారుల్లో కరోనా లక్షణాలు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. చాలామంది చిన్నారుల్లో అసింపతిక్ లక్షణాలే ఎక్కువగా ఉంటున్నాయి. కొంతమంది చిన్నారుల్లో మాత్రమే కొద్దిపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ కరోనా లక్షణాల్లో జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు వంటి లక్షణాలు అధికంగా నమోదవుతున్నాయి. చిన్నారుల్లో కరోనా సోకినవారిలో జ్వరం 103 నుంచి 104 డిగ్రీలు ఉంటోంది. ఒకవేళ చిన్నారుల్లో జ్వరం 4 లేదా 5 రోజులు అలానే ఉంటే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదంటున్నారు నిపుణులు. వారి బీపీ లెవల్ ఎప్పటికప్పుడూ చెక్ చేస్తుండాలి. ప్లస్ ఆక్సిమీటర్ ద్వారా ఎప్పటికప్పుడూ వారి ఆక్సిజన్ లెవల్ ట్రాక్ చేస్తుండాలి. ఒకవేళ ఆక్సిజన్ లెవల్ తగ్గితే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణ కరోనా లక్షణాల కంటే.. అసాధారణ కరోనా లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్దల్లో కంటే చిన్నారుల్లో కొత్త లక్షణాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. దీర్ఘకాలిక జలుబుతో బాధపడేవారిలో పిల్లల ఊపిరితిత్తులపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అది కూడా న్యుమోనియా వంటి కేసుల్లో ఈ ముప్పు అధికంగా ఉంటోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో ముక్కు దిబ్బెడ కూడా కరోనా వైరస్ లక్షణాల్లో ఒక సంకేతంగా చెప్పవచ్చు. ఎర్రబారడం, పెదాలు పగలడం లేదా ముఖం, పెదాలపై నీలం రంగులోకి మారిపోవడం వంటి లక్షణాలు ఉంటున్నాయి. అలెర్జీలు, నిద్రలేమి, ఆకలి లేకపోవడం సహా ఇతర లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

చాలామంది పిల్లల్లో కరోనా స్వల్ప లక్షణాలే ఎక్కువగా ఉంటున్నాయి. కానీ, చిన్నపిల్లల నుంచి ఇతరులకు వైరస్ వ్యాపింపచేస్తారా లేదా అనేది స్పష్టత లేదు. అలాంటి అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా చెప్పడానికి ఎలాంటి ఆధారాలేమి అంటున్నారు. ఈ విషయంలో ఒక నిర్ధారణకు రావాలంటే మరింత పరిశోధన లోతుగా జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ బారినుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలంటే.. కరోనా నిబంధనలు పాటించేలా చిన్నారులకు అవగాహన కల్పించాలి. పిల్లలను కరోనా బారినుంచి రక్షించేందుకు కొన్ని ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కరోనా తీవ్ర ప్రభావం నుంచి చిన్నారులను రక్షించేందుకు సాధారణ కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందిగా సూచిస్తున్నారు.

సామాజిక దూరం, మాస్క్ లు ధరించేలా చూడటం, పరిశుభ్రతతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకునేలా అవగాహన కల్పించాలి. ప్రస్తుతం చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ప్రస్తుతానికి పిల్లలలకు ఇన్ఫూయింజా ఫ్లూ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వొచ్చు. మంచి పోషకాహారంతో పాటు విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, డి విటమిన్, కాల్షియం, జింక్ వంటి పోషక విలువలు కలిగిన ఆహారపదార్థాలు అందేలా చూడాలి. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఎక్కువ మొత్తంలో మంచినీళ్లు తాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు వైద్య నిపుణులు.