Plastic stools : ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రంధ్రం ఎందుకుంటుందో తెలుసా..?

మీరెప్పుడైనా గమనించారా..? ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో ఓ ‘రంధ్రం‘ ఉంటుంది. ఆ రంధ్రం ఎందుకుంటుంది..? దానికి కారణమేంటి..?

Plastic stools : ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రంధ్రం ఎందుకుంటుందో తెలుసా..?

Plastic stools

Updated On : October 2, 2023 / 5:53 PM IST

Plastic stools hole in the center : ఒకప్పుడు ఇళ్లల్లో చెక్క కుర్చీలు,చెక్క స్టూల్స్ ఉండేవి. ఇప్పుడంతా ప్లాస్టిక్ వే ఉంటున్నాయి. ప్రతీ ఇంట్లోనే ప్లాస్టిక్ కుర్చీలు, స్టూల్స్ ఉంటున్నాయి. స్టూల్స్ పెద్దవి, చిన్నవి కూడా ఉంటాయి. కింద కూర్చుని పని చేసుకోవటానికి పైన కూర్చోవటానికి ఇలా రకరకాల ఎత్తుల్లో స్టూల్స్ అందుబాటులో ఉంటున్నాయి. కానీ మీరెప్పుడైనా గమనించారా..? ఆ ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో ఓ ‘రంధ్రం‘ ఉంటుంది. ఆ రంధ్రం ఎందుకుంటుంది..? దానికి కారణమేంటి..? అని ఎప్పుడైనా ఆలోచించారా..? మనం రోజు చూసేవే అయినా..వినియోగించేవే అయినా అన్నింటిని సరిగా గుర్తించం. అటువంటిదే ఈ ప్లాస్టిక్ స్టూల్స్ కు ఉండే రంధ్రం కూడా..ఈ రంధ్రం వెనుక లాజిక్ ఏంటో తెలుసుకుందాం..

ఒకవేళ ఆ రంధ్రం ఎందుకుంది..? అనే అనుమానం వస్తే ‘ఏముంది కుర్చీకైతే హ్యాండిల్స్ ఉంటాయి పట్టుకోవటానికి..ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్లటానికి..మరి స్టూల్స్ కు అవి ఉండవు కదా..ఒకచోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లడానికి చాలా సులభంగా రంధ్రం పెట్టి ఉంటారు అని చెప్పేస్తాం. నిజం చెప్పాలంటే ఇది కూడా ఓ కారణం అయి ఉండొచ్చు. కానీ మనకి తెలియని ఇంకొన్ని విషయాలున్నాయి ఈ రంధ్రం ఉండేలా ప్లాన్ చేయటంలో..

Very Rare fruit : అరుదైన పండు..తిందామంటే దొరకదు, దొరికితే తప్పకుండా తినాల్సిందే

ఈ రంధ్రాలు స్టూల్ నిర్మాణ సమగ్రతను కాపాడుతుంది. అంతేకాదు మనం కూర్చున్నప్పుడు అది విరిగి పోకుండా ఉండటానికి ఓసహాయకారిగా కూడా ఉపయోగపడుతుంది.కూర్చున్నప్పుడు గాలి మొత్తం ఒత్తిడి లేకుకండా ఆ రంధ్రం నుంచి బయటకు వెళ్లిపోతుంది. స్టూల్ గుండ్రంగా ఉన్నా..మరి ఏ ఆకాంలో ఉన్నా శక్తి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై పగుళ్లు వచ్చి విరిగి పోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకోసమే వాటిపై రంధ్రం గుండ్రటి ఆకారంలో ఉంటుంది.

ప్లాస్టిక్ స్టూల్ లో రంద్రాలు ఉండటానికి మరో కారణం కూడా ఉంది. వాటిని ఒకదానిపై మరొకటి పేర్చటానికి కూడా ఈ రంధ్రం ఉపయోగపడుతుంది. అది లేకపోతే స్టూలు స్టూలుకు మధ్యలో గాలి చొరబడి ఒకదానిపై మరొకటి సెట్ అవ్వదు. అదే ఈ రంధ్రం వల్ల గాలి ఒత్తిడి ఉండదు. అంటే రంద్రాలు ఉండటం వల్ల శూన్యతను నిరోధించడానికి, వాటిని పేర్చబడిన అప్పుడు గాలి పీడనాన్ని తగ్గించి వాటిని అమర్చుకునేందుకు వీలుగా ఉంటుంది. భలే ఉన్నాయి కదూ ఈ చిన్ని రంధ్రం వల్ల భలే భలే ఉపయోగాలు..చిన్న రంధ్రమే అయినా మనకు తెలియని ఉపయోగాలు బాగానే ఉన్నాయే అనిపిస్తోంది కదూ..

Gurivinda Ginjalu : దుష్టశక్తుల్ని దరిచేరనివ్వని గురివింద గింజ‌లు..