Very Rare fruit : అరుదైన పండు..తిందామంటే దొరకదు, దొరికితే తప్పకుండా తినాల్సిందే
అదొక అరుదైన పండు. తిందామంటే దొరకదు.కానీ దొరికితే తినాల్సిందే. ఎందుకంటే ఈ పండు చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కరం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Sky fruit
Rare fruit ..Sky fruit : ద్రాక్ష, మామిడి, బత్తాయి, యాపిల్ అరటి,నారింజ, జామ వంటి పండ్లు మనకు తెలుసు. కానీ ఈ ప్రకృతిలో మనకు తెలియని వింత వింత పండ్లు చాలానే ఉన్నాయి. వాటి పేరు కూడా చాలామంది విని ఉండరు. వాటి ఆకారాలు కూడా వింతగా..విచిత్రంగా ఉంటాయి. ఆ పండ్ల లోపల ఎలా ఉంటుంది..?వాటి రుచి ఎలా ఉంటుంది..? అసలు అవి తింటారా? అనే ఎన్నో ఎన్నో సందేహాలు వచ్చేస్తాయి. మరెన్నో భయాలు కూడా కలుగుతాయి. ఇంకా చెప్పాలంటే ఏ పండును ఎలా తినాలో కూడా అర్థం కాకుండా ఉంటాయి వాటి ఆకారం చూస్తే. వాటిని డైరెక్టుగా తినాలా..? లేదా ఒలిచి తినాలా..పగుల గొట్టి తినాలా ఇలా ఎన్నో ఎన్నెన్నో డౌట్స్ వచ్చేస్తాయి. అటువంటి ఓ వింత పండు అరుదైన పండు గురించి తెలుసుకుందాం..
ఆ అరుదైన పండు పేరు ‘స్కై ప్రూట్‘ అంటే తెలుగులో ఆకాశ పండు అని అర్థం. ఈ పండు అంతగా అందరికి అందుబాటులో ఉండదు. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ పండును ఎక్కువగా తింటారు. అందుకే ఈ పండును తిన్న వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఆయుర్వేదంలో ఈ పండు గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఇది చెక్ పెడుతుందట. మధుమేహం ఉన్నవారికి ఈ పండు చాలా చాలా మంచిది. తిందామన్నా కూడా ఇది చాలా తక్కువ ప్రాంతాల్లోనే లభిస్తుంది.
విటానికి దీని పేరు వింతగా ఉన్నా ఈ స్కై ఫ్రూట్ ఇప్పటిది కాదు. చాలా పాతదే.ఈ పండు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దరికి చేరకుండా కాపాడుతుంది. చూడడానికి కివీ ఫ్రూట్ లా కనిపిస్తుంది. కానీ దాని కంటే కాస్త పెద్దసైజే ఉంటుంది.కివి చాలా మెత్తగా ఉంటుంది. కానీ ఇది గట్టిగా ఉంటుంది. దీన్ని ఎలా తినాలో కూడా అర్థంకాదు ఎందుకంటే దీని గురించి చాలామందికి తెలియనే చెప్పాలి.
దీన్ని తినాలంటే పగలగొట్టి గింజను బయటకు తీసేసి తినాలి. కానీ రుచి మాత్రం పెద్దగా ఉండదు. అందుకనే ఈ పండు అందుబాటులో ఉన్నవారు కూడా పెద్దగా తినరు. కానీ చాలా ఆరోగ్య సమస్యలకు ఇది డాక్టర్ లాంటిది అని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. రుచి లేని ఈ పండు కాస్త చేదుగా ఉంటుందట. బహుశా అందుకేనేమో శరీరానికి చాల మంచి చేస్తుంది. మరీ ముఖ్యంగా మధుమేహులకు చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు ఈ పండు చక్కెర స్థాయిలు సక్రమంగా పనిచేస్తాయి. 200 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఈ పండును తింటే చాలు, చక్కెర స్థాయిలు చక్కగా తగ్గిపోతాయట. గింజల్ని తీసేసి ఈ పండు తినాలని చెబుతారు కానీ విత్తనాల్ని కూడా తినొచ్చట. ఈ పండును పొడి రూపంలో మార్చుకొని తినేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఆన్ లైన్ షాపింగ్ లో ఇది దొరుకుతుంది.
ఆకాశ పండుతో అరుదైన ఉపయోగాలు..
ఆకాశ పండు (స్కై ఫ్రూట్) తింటే గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
మలబద్ధకం వంటి సమస్యలు రావు.
చర్మ ఎలర్జీలకు ఇది మంచి చికిత్సగా పనిచేస్తుంది..
శరీరానికి బలాన్ని ఇస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచి వైరస్, బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో బేషుగ్గా పనిచేయటంతో గుండె సమస్యలు రావు.
రక్తనాళాలు మూసుకుపోకుండా అడ్డుకుంటుంది.
మహిళలు రుతుస్రావం సమయంలో కడుపునొప్పితో బాధపడేవారు ఇది తింటే నొప్పి తగ్గిపోతుంది.. పిసిఒడి వంటి సమస్యల్ని తగ్గిస్తుంది..
ఈ పండు అరుదైనది. కాబట్టి మన ప్రాంతాల్లో అందుబాటులో ఉండదు. కానీ దొరికితే చక్కగా తినాల్సిన పండు. కానీ చాలా తక్కువగా మాత్రమే తినాలి.ఎక్కువగా తింటే కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయట. ఏది ఏమైనా డాక్టర్ల సూచనల్ని పాటిస్తే మంచిదనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది అరుదైనది కాబట్టి బహుశా ఎప్పుడు తిని ఉండము కాబట్టి..ఒకవేళ అది లభ్యమైతే నిపుణుల సూచనలు పాటించి తినటం మంచిది.
స్కైఫ్రూట్ తో సైడ్ ఎఫెక్ట్స్..
అయితే ఈ పండు ఎక్కువగా తింటే కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. తిన్నాక వికారంగా అనిపించినా, ఆకలి వేయకపోయినా, మూత్రం రంగు మారినా వెంటనే డాక్టర్లు సంప్రదించటం మంచిది.ఈ పండు తింటేకొంతమంది కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయట. కళ్ళల్లోని తెలుపు రంగు కాస్త పసుపు రంగులోకి మారినా, చర్మం పసుపు రంగులోకి మారినా ఈ పండును తినడం మానేయాలి. అలా వెంటనే డాక్టర్లు సంప్రదించటం చాలా చాలా మంచిది అనే విషయాన్ని మర్చిపోకూడదు.