Sambrani : ఇంట్లో ధూపం ఎందుకు వేస్తారో తెలుసా?

సాంబ్రాణి దూపం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెప్తోంది. శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుంది.

Sambrani : ఇంట్లో ధూపం ఎందుకు వేస్తారో తెలుసా?

Dupam

Sambrani : పురాతన కాలం నుండి వస్తున్న ఆచారాల్లో ధూపం ఒకటి. ఇంట్లో దూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. దేవునికి దూపం వేయటంతో ప్రారంభమైన అలవాటు ఆతరువాత కాలంలో ఆనవాయితీగా వస్తుంది. ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా, రోగరహితంగా, పరిమళ భరితంగా మార్చుకునేందుకు ఈ దూపం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సాంబ్రాణి కడ్డీలు వెలిగించటం అందరికి అలవాటై పోయింది. అయితే పూర్వం సాంబ్రాణి, సుద్ధచందనాన్ని కలిపి ఆవు పిడకల్లోనో, గుగ్గిలంలోనో వెలిగించే వారు.

దోమలు, సూక్ష్మ క్రిములు వంటివి ఈ పొగ కారణంగా నిర్మూలించబడతాయని నమ్మేవారు. అయితే ఈ దూపం పొడి హానికరమైన రసాయనాలు ఉపయోగించి తయారు చేయనందున దానిని నుండి వచ్చే పొగను పీల్చినా ఎలాంటి హాని జరగదు. పరిసరాలను క్రిమి కీటకాలు లేకుండా ఉంచేందుకు దోహదపడుతుంది. ఇంట్లో సాంబ్రాణి దూపం వేయటం వల్ల మనస్సు ఉల్లాసంగా, ప్రశాతంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా బాలింతలకు, శిశువులకు సాంబ్రాణి దూపం వేస్తారు. శ్వాస సంబంధిత రుగ్మతలు లేకుండా చేస్తుంది. పసిపిల్లలకు స్నానం చేసిన తరువాత దూపం వేయటం వల్ల ఆకలితోపాటు వారు హాయిగా నిద్రించేలా చేస్తుంది. జలుబు దగ్గు వంటి సమస్యలు దరిచేరవు.

సాంబ్రాణి దూపం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెప్తోంది. శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుంది. అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి దూపం మందులా పనిచేస్తుంది. సాంబ్రాణి ఆయుర్వేదం లో కీళ్ళనొప్పుల నివారణకు జీర్ణక్రియ, చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. వివిధ రకాల లేహ్యాల్లో కూడా సాంబ్రాణి వాడతారు. సాంబ్రాణి ఆస్తమా, అల్సర్, క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందుల్లో ఉపయోగిస్తారు.

సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవని చెబుతుంటారు. ప్రస్తుతం మార్కెట్లలో పొడి రూపంలో సాంబ్రాణి లభిస్తుంది. ఒకప్పుడు బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి పొడిని చల్లుతారు. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి ధూప్ స్టిక్స్అం దుబాటులో ఉన్నాయి. తల స్నానం చేసిన తరువాత సాంబ్రాణి దూపం వేయటం వల్ల తల త్వరగా ఆరటమే కాకుండా కుదుళ్ళ ఆరోగ్యానికి మంచికలుగుతుంది. ఇంట్లో సాంబ్రాణి దూపం వేయటం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెబుతున్నారు. దూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.