Farts Selling: పిత్తులు అమ్మే టీవీ స్టార్‌కు గుండెనొప్పి

డబ్బు కోసం చేసే వింత పనుల్లో ఇదొకటి. అమెరికాకు చెందిన టీవీ స్టోర్ గాజు సీసాల్లో బాంబులేసి కోట్ల రూపాయలు సంపాదించింది. ఒకానొక సందర్భంలో ఒక్కోసారి అలా చేస్తే కోటి రూపాయల వరకూ వసూలు..

Farts Selling: పిత్తులు అమ్మే టీవీ స్టార్‌కు గుండెనొప్పి

Farting Sell

Farts Selling: డబ్బు కోసం చేసే వింత పనుల్లో ఇదొకటి. అమెరికాకు చెందిన టీవీ స్టోర్ గాజు సీసాల్లో బాంబులేసి కోట్ల రూపాయలు సంపాదించింది. ఒకానొక సందర్భంలో ఒక్కోసారి అలా చేస్తే కోటి రూపాయల వరకూ వసూలు చేసేది. ఇప్పుడు ఆమె రిటైర్మెంట్ తీసుకోవడానికి రెడీ అయిపోయిందట. 31ఏళ్ల ఈ యువతి అందుకే రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్పింది. ఇదంతా ఆమెకు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేంతవరకూ తెలియలేదేమో పాపం.

డైలీ మెయిల్ కథనం ప్రకారం… మట్టోకు ఛాతీలో నొప్పి వస్తుండటంతో ఎమర్జెన్సీ రూంలో అడ్మిట్ చేశారు. గుండెనొప్పిలా భావించి భయాందోళనకు గురైందట. ఏ క్షణమైనా చనిపోతానని భావించి వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆమె తరచుగా చిక్కుళ్లు, గుడ్లు, అరటి పండ్ల ప్రొటీన్ షేక్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ పెరిగిపోయిందని తెలిపారు.

పిత్తులు వేయడం కోసమే సపరేట్ డైట్ ఫాలో అయ్యే ఆమెకు అదే అనారోగ్యానికి కారణం అయింది. దీంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోకతప్పలేదు.

ఇది కూడా చదవండి: టమాటా సాగుకు అనువైన రకాలు

‘హాస్పిటల్ లో అడ్మిట్ అవడానికి ముందు రోజు తీసుకున్న ఆహారం వల్ల గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయి చెస్ట్ పెయిన్ వచ్చింది. గాలి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. హార్ట్ అటాక్ అనుకున్నా. నా ఫ్రెండ్ సాయంతో హాస్పిటల్ కు వెళ్లా. డాక్టర్లు గ్యాస్ పెయిన్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నా. గ్యాస్ ఉత్పత్తి కాకుండా సపరేట్ డైట్ తీసుకోమని చెప్పడంతో నా బిజినెస్ ఆపేయాల్సి వచ్చింది’ అని ఆ మహిళ సోషల్ మీడియాలో తన ఫీలింగ్ ను బయటపెట్టింది.