Old Age : వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం… ఆహార నియామాలు

శరీర పోషణకు కావలసిన పదార్థాలను తీసుకోవటంతోపాటు శరీరానికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చే ఆహార ఓదార్ధాలను తినటం మంచిది.

Old Age : వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం… ఆహార నియామాలు

Old Age

Updated On : February 23, 2022 / 5:28 PM IST

Old Age : వయస్సు పై బడే కొద్దీ ఆహారనియమాల్లో మార్పులు తప్పనిసరి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వయస్సుకు తగ్గట్టుగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వృద్ధాప్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహరం తీసుకోవటం మంచిది. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు రోగ నిరోధక శక్తికి కావలసిన విటమిన్లను అవసరత ఎక్కువగా ఉంటుంది.

వయసు పైబడిన తరువాత అనేక కారణాలరీత్యా ఆహార విషయాల్లోనూ కొన్ని నియమాలు పాటించక తప్పదు. విటమిన్‌ డి, కాల్షియం, విటమిన్‌ బి12, పీచు, పొటాషియం వంటి పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. అవి లభించే ఆహారాన్ని తీసుకోవటం మర్చిపోకూడదు. తక్కువ కొవ్వు ఉండే పాల పదార్థాలు, ఆకు కూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్‌ డి, కాల్షియం పొందవచ్చు. ఎముక పుష్టికి ఇవి దోహదం చేస్తాయి. చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాంసం నుంచి విటమిన్‌-బి12 అందుతుంది.

శరీర పోషణకు కావలసిన పదార్థాలను తీసుకోవటంతోపాటు శరీరానికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చే ఆహార ఓదార్ధాలను తినటం మంచిది. శరీరానికి నూతనోత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటివి ఈ కోవకే చెందుతాయి. వృద్ధాప్యంలో ప్రకృతిలో లభించే పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అన్నంతో పాటుగా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటేనే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి.

సాధారణంగా వృద్ధాప్యంలో తప్పనిసరిగా వేధించే సమస్య మలబద్ధకం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం ఎక్కువగా తీసుకుంటే ఆ బాధ నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. ఎందుకంటే వీటన్నింటిలోనూ పీచు అధికంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న పాల పదార్థాలలో వృద్ధులకు అవసరమైన పొటాషియం కూడా ఉంటుంది. నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించడం మంచిది.

వృద్ధాప్యంలో ఆకలి మందగించటం మూలంగా చాలా మంది తినటం మానేస్తుంటారు. దీని వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అందకుండా పోతాయి. ప్రొటీన్ లోపం ఏర్పడుతుంది. శరీరంలో చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. కాల్షియం, ఐరన్ ఉండే ఆహారపదార్ధాలను తినాలి. సమతుల ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలను అధిగమించటంతో పాటు ఆయుష్షు పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది.