Puffed Rice Snacks : మరమరాల స్నాక్స్ తో ఆరోగ్యానికి మేలే!.

సోడియం తక్కువగా ఉండే మరమరాలను నిత్యం తీసుకుంటే రక్తపోటు స్థిరంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. పిల్లలో రక్తహీనత సమస్య సాధారణంగా కనిపిస్తుంటుంది.

Puffed Rice Snacks : మరమరాల స్నాక్స్ తో ఆరోగ్యానికి మేలే!.

Puffed Rice Weight

Puffed Rice Snacks : మరమరాలు తినడం చాలామంది ఇష్టపడతారు. చిన్నారుల నుండి పెద్దల వరకు కాలేక్షేపానికి మరమరాలుతో చేసిన రుచికరమైన మసాలాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. వాటితో ఆకలితీరకపోయినా మంచి స్నాక్స్ గా ఉపకరిస్తుంది. అనేక పోషకవిలువలు మరమరాల్లో ఉన్నాయి. వీటిల్లో విటమిన్‌ డి, విటమిన్‌ బి లతో పాటు క్యాల్షియం, ఐరన్‌ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. మరమరాలు చాలా తేలినకైన ఆహారం. తక్కువ కేలరీలుంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఇవి సహాయ పడుతాయి. 100 గ్రాముల మరమరాలు తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్‌ అందుతుంది. మరమరాలతో తయారైన ఆహారపదార్థాలు చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.

పిల్లల ఎదుగుదలలో మరమరాలు ఉపయోగపడతాయి. మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, ఆహారం మితంగా తీసుకోవాలనుకునే డయాబెటీస్ వ్యాధిగ్రస్థులకు మరమరాలు మంచివి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. అందుకని కాసిని తిన్నా కావలసిన శక్తి సమకూరుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడంతో మరమరాలతో తయారయిన ఆహారపదార్థాలు చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. మరమరాల్లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల రోగనిరోధక శక్తి ఇనుమడింపచేస్తుంది.

సోడియం తక్కువగా ఉండే మరమరాలను నిత్యం తీసుకుంటే రక్తపోటు స్థిరంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. పిల్లలో రక్తహీనత సమస్య సాధారణంగా కనిపిస్తుంటుంది. మరమరాల్లో ఐరన్‌ కంటెట్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని పిల్లలకు క్రమంతప్పకుండా ఇస్తే రక్తవృద్ధి జరుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలకు మరమరాలతో చేసిన స్నాక్స్‌ ఇస్తే నీరసం, అలసట వంటి సమస్యలు దూరమై శక్తివంతంగా ఉంటారు.

డయా బెటీస్‌ వ్యాధిగ్రస్తులకూ మరమరాలు మంచివే. వరి అన్నం లాగే ఇందులోనూ కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువ. కాబట్టి డయాబెటిస్‌ రోగులు వరి అన్నానికి మరమరాలు ప్రత్యామ్నాయమని అనుకోవడం సరికాదు. పోషక విలువలు పిల్లల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. మరమరాలతో పాయసం, లడ్డూ, ఛాట్‌ వంటివి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.మరమరాలు, వేయించిన పల్లీలు, టమాటా, కొత్తిమీర, నిమ్మకాయ రసం కలిపి సాయంత్రం వేళల్లో స్నాక్స్ గా తీసుకోవచ్చు.