Gas Problem : గ్యాస్ సమస్యకు చెక్ పేట్టే ఇంటి చిట్కాలు!
ఒక కప్పు మరిగించిన నీటిలో ఒక టేబుల్‌స్పూన్ సోంపు వేసి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఉదయాన్నే వడకట్టిన ఆ నీటిలో ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగండి.

Gas Problem : జీవనశైలి, తినే ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది దైనందిన జీవితంలో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా రోజువారి పనులు సరిగా నిర్వర్తించలేని పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో గ్యాస్ సమస్య కారణంగా పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. సమస్య నుండి బయటపడేందుకు వివిధ రకాల పద్దతులను అనుసరిస్తుంటారు. అయితే ఇంట్లో లభించే కొన్ని రకాల పదార్ధాలతోనే గ్యాస్ సమస్యకు శులభంగా చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. గ్యాస్ సమస్యను పొగొట్టేందుకు కొబ్బరి నీళ్లు బాగా ఉపకరిస్తాయి. రోజు కొబ్బరి నీళ్లను తాగటం అలవాటు చేసుకుంటే గ్యాస్ నుండి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ సమస్యకు ముఖ్యకారణం తిన్నది జీర్ణం కాకపోవటమే. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు అల్లంను ఆహారంలో బాగం చేసుకుంటే మంచిది. రోజూ ఉదయాన్నే పరగడుపున రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకోవాలి.
ఒక కప్పు మరిగించిన నీటిలో ఒక టేబుల్‌స్పూన్ సోంపు వేసి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఉదయాన్నే వడకట్టిన ఆ నీటిలో ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే ఎసిడిటీ నుండి ఉపశమనం దొరుకుతుంది. గ్యాస్ సమస్యకు మజ్జిగ మంచి మేలు చేస్తుంది. మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ కడుపులోని గ్యాస్‌కు కల్లెం వేస్తుంది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తిన్నప్పుడు మజ్జిగ తీసుకోవడం మంచిది. చల్లార్చిన గ్లాసు పాలలోకి ఒక స్పూను తేనె కలుపుకుని తాగటం వల్ల గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు. తులసి ఆకుల్ని వేడి నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని చల్లారిన తరువాత సేవించాలి. ఇలా పదిరోజులు చేస్తే గ్యాస్ నుండి ఉపశమనం కలుగుతుంది.
1Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
2Lokesh Kanagaraj : మిమ్మల్ని కలుస్తాను.. విక్రమ్ డైరెక్టర్ తో మహేష్ మీట్.. సినిమా ఛాన్స్?
3BJP: ‘మెంటల్ ట్రీట్మెంట్ తీసుకో’ అంటూ రాజస్థాన్ సీఎంకు సూచించిన బీజేపీ ఎంపీ
4Hyderabad: ‘విజయ సంకల్ప’ సభకు హాజరైన గద్దర్.. బీజేపీ తీర్థంపుచ్చుకోనున్న విశ్వేశ్వరరెడ్డి
5BJP National Executive Meeting : ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
6India vs England: భారత బౌలర్ల ధాటికి రాణించలేకపోతున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్
7Madhya Pradesh: ఓ చెట్టు కొమ్మ నుంచి మరో చెట్టుకొమ్మ పైకి ఎగిరి కోతి పిల్లను పట్టుకున్న పులి.. వీడియో
8Small Movies : ఆసక్తి పెంచుతున్న చిన్న సినిమాలు..
9Hyderabad : ప్రేమించి పెళ్లి చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య ?
10Yadamma: నన్ను ఎవరూ అడ్డుకోలేదు.. ఆ వార్తలను ఖండించిన వంటల స్పెషలిస్ట్ యాదమ్మ
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
-
Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
-
Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
-
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
-
Bangaru Bonam : విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
-
Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్