Gum Disease : పంటి చిగుర్ల వ్యాధులు ఎలా వస్తాయ్? చిగుర్లు ఆరోగ్యంగా ఉండాలంటే?

సాధారణంగా చిగుర్ల వ్యాధులకు తొలి దశల్లో నొప్పి అంతాగా అనిపించదు. తర్వాత నొప్పి వస్తుంది. నోటి దుర్వాసన, చిగుర్లు ఎర్రబారటం, చిగుర్ల వాపు, ఉబ్బినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముట్టుకుంటే జివ్వుమనటం, చిగుర్ల నుండి రక్తస్రావం, నమిలినప్పుడు నొప్పిగా అనిపించటం, పళ్లు వదులైనట్లుగా , పళ్ల మధ్య సందులు ఏర్పడటం, వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Gum Disease : పంటి చిగుర్ల వ్యాధులు ఎలా వస్తాయ్? చిగుర్లు ఆరోగ్యంగా ఉండాలంటే?

gum disease occur

Gum Disease : తెల్లగా బయటకు కనిపించే పంటిలో ముఖ్యమైన నాలుగా భాగాలు ఉంటాయి. వీటిలో మొదటిది పంటి పై ఉండే ఎనామెల్ పొర, రెండోది దాని కింద ఉండే డెంటిన్, ఆ కింద పంటికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు , నరాల చివరలు ఉంటాయి. రక్తనాళాలు, నరాల చివరి భాగాల కింద పంటి ఎముక ఉంటుంది. ఈ నాలుగూ ఆరోగ్యంగా ఉంటే పన్ను ఆరోగ్యంగా ఉంటుంది. చిగుర్ల వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చిగురు పంటిని కలిపి ఉండే గమ్ లైన్ వద్ద గార పేరుకోవటం ద్వారా చిగురు వ్యాధి మొదలవుతుంది. ఈ గారలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి.

ఈ బ్యాక్టీరియా ప్రమాదరహితమైనదే. అయితే మనం క్రమం తప్పకుండా సరైన పద్దతిలో బ్రష్ చేసుకుంటే చిగుర్ల అంచున ఉండే పాచి తొలగిపోతుంది. పళ్ల మధ్యన, బ్రషింగ్ కు వీలు కాని చోట పేరుకునే పాచిని మందపాటి దారంతో శుభ్రం చేసుకోవాలి. రోజు వారిగా సరైన పద్దతిలో బ్రష్ చేసుకోక పోవటం వల్ల గార పెరుగుతుంది. అంతేకాకుండా దీని వల్ల బ్యాక్టీరియా పేరుకు పోయి చిగుర్లు దెబ్బతింటాయి. ఈ దశలో వైద్యులను సంప్రదించాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది.

సాధారణంగా చిగుర్ల వ్యాధులకు తొలి దశల్లో నొప్పి అంతాగా అనిపించదు. తర్వాత నొప్పి వస్తుంది. నోటి దుర్వాసన, చిగుర్లు ఎర్రబారటం, చిగుర్ల వాపు, ఉబ్బినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముట్టుకుంటే జివ్వుమనటం, చిగుర్ల నుండి రక్తస్రావం, నమిలినప్పుడు నొప్పిగా అనిపించటం, పళ్లు వదులైనట్లుగా , పళ్ల మధ్య సందులు ఏర్పడటం, వంటి లక్షణాలు కనిపిస్తాయి.

శరీరంలోని జీవకణాలకు ఆహారాన్ని , పోషకాలను అందించటానికి ఆహారం అతి ముఖ్యం. అయితే ఈ కార్యకలాపాలకు తోడ్పడే తొలి అవయవాలు పళ్లు, వాటిని పట్టి ఉంచే చిగుర్లు. అందుకే మన శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే మన నోటి ఆరోగ్యం బాగుండాలి. ప్రతి ఆరు మాసాలకు ఒకసారి తప్పనిసరిగా పంటి వైద్యులను కలసి దంత పరీక్షలు చేయించుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి చికిత్స చేయించుకోవాలి.