Pregnant Women : చలికాలంలో గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు పాటించటం అవసరమా?

శీతాకాలంలో జబ్బులు చెంతనే పొంచి ఉంటాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గర్భంతో ఉన్నవారు ఎలాంటి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించే ఆహారాలను తీసుకోవాలి.

Pregnant Women : చలికాలంలో గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు పాటించటం అవసరమా?

Pregnant Women :

Pregnant Women : గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదు. గర్భంతో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం తల్లీ, బిడ్డలకు ఇద్దరికీ క్షేమకరం. బిడ్డ ఆరోగ్యంగా పుట్టటానికి అవసరమైన జాగ్రత్తలన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. శరీరంలో వచ్చే రకరకాల హార్మోన్ల మార్పుల వల్ల ఆ ప్రభావం మనస్సుపై పడుతుంది. అంతేకాకుండా గర్భధారణ సమయంలో మధుమేహం, గర్భధారణ రక్తపోటు, ఆందోళన, నిరాశ, పైల్స్, థైరాయిడ్ సమస్యలు, పోషకాహార లోపాలు, రక్తహీనత, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు తినే ఆహారాలు పిండంపై ప్రభావం చూపుతాయి. మనం తినే ఆహారాలు నేరుగా మన పుట్టబోయే బిడ్డకు అందుతాయి. కాబట్టి పౌష్టికాహారం తీసుకోవటం ఉత్తమం. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు, సంతృప్త కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఆల్కహాల్, గ్రీన్ టీ, ప్రాసెస్ చేసిన ఎర్రమాంసం, పాలు, జున్ను వంటి వాటిని తీసుకోకపోవటం మంచిది. వీటిని ఎక్కువగా తినడం వల్ల బిడ్డపై ప్రభావం ఉంటుంది. సప్లిమెంట్లను వైద్యుడిని సలహాతో మాత్రమే తీసుకోవాలి.

కొందరిలో నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. దీనికి ఎక్కువ పిండాలు అభివృద్ధి చెందినప్పుడు ఎక్కువగా ఇలా జరుగుతుంది. మరికొందరిలో డెలివరీ డేట్ ముగిసిన తర్వాత కూడా బిడ్డ కడుపులోనే ఉంటుంది. రోజువారీ వ్యాయామం మీరు గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే వైద్యుల సలహాతోనే వ్యాయామాలు చేయాలి. కఠిన మైన వ్యాయామాలు కాకుండా తేలికపాటి వ్యాయామాలు మేలు.

చాలా మంది గర్భిణీ స్త్రీలకు గర్భస్రావం జరుగుతుందేమోనన్న భయంతో నిత్యం మానసిక పరమైన ఇబ్బందిని ఎదుర్కొంటుంటారు. సాధారణంగా మొదటి 3 నెలలు శిశువును సురక్షితంగా చూసుకోవడం అవసరం ఆసమయంలోనే ఎక్కవ అబార్షన్ జరగటానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడికి గురికాకుండా, భయం లేకుండా ఉండాలి.

శీతాకాలంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ;

శీతాకాలంలో జబ్బులు చెంతనే పొంచి ఉంటాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గర్భంతో ఉన్నవారు ఎలాంటి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించే ఆహారాలను తీసుకోవాలి. ఆహారంలో సరైన మోతాదులో అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. అయోడిన్ శిశువు మానసిక ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి అయోడిన్ మంచి పరిమాణంలో ఉండటం మంచిది. గర్భంతో ఉన్నప్పుడు ప్రోటీన్ కూడా చాలా అవసరం. ఈ చలికాలంలో ప్రోటీన్ కలిగిన ఆహారాలు వెచ్చదనాన్ని ఇస్తాయి. మల బద్దకం సమస్య ఎదురుకాకుండా ఫైబర్ కలిగిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.