Diabetes With Aloevera : కలబందతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటం సాధ్యమేనా?

కలబంద జ్యూస్ ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వ్యక్తులలో మధుమేహం అభివృద్ధిని సమర్థవంతంగా నిరోధిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే పోషకాలు ఇందులో ఉన్నాయి.

Diabetes With Aloevera : కలబందతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటం సాధ్యమేనా?

Diabetes With Aloevera : జీవక్రియల్లో అసాధరణ మార్పునే డయాబెటిస్ అంటారు. వైద్య పరిభాషలో ఈ స్థితిని డయాబెటిస్ మిల్లెటిస్ అంటారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెరశాతం సాధారణం కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్, చక్కెర శాతం నిర్థిష్టంగా ఉండక ఎప్పుడూ హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది. మనం తీసుకొనే ద్రవ, ఘణ పదార్థాల నుంచి శరీరం గ్లూకోజ్ గ్రహిస్తుంది. ఈ గ్లూకోజ్ శరీరంలోని కణాల్లోకి వెళ్లి శక్తిని అందజేసి జీవక్రియలు సరిగా జరగడానికి ఇన్సులిన్ సహకరిస్తుంది. ఇక డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఇన్సులిన్ తగిన మొత్తంలో విడుదల కాదు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు చాలా మంది వివిధ రకాల చిట్కాలను ఫాలో అవుతుంటారు. అయితే అలాంటి వాటిలో కలబంద జ్యూస్ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటంలో బాగా ఉపకరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇతర జ్యూస్‌లతో పోలిస్తే అలోవెరాలో చక్కెర తక్కువగా ఉంటుంది. మధ్యస్ధమైన గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్‌ను కలిగి ఉండటం వల్ల ఆహార పదార్ధం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచటమన్నది నెమ్మదిగా ఉంటుంది. అలాగని కలబంద మధుమేహాన్నిపూర్తిగా నయం చేయదు. కలబంద జ్యూస్ ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వ్యక్తులలో మధుమేహం అభివృద్ధిని సమర్థవంతంగా నిరోధిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే పోషకాలు ఇందులో ఉన్నాయి. డయాబెటిక్ రోగులలో రక్తంలో గ్లూకోజ్ మరియు లిపిడ్లను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది.

మధుమేహం చికిత్సలో కలబందను ఉపయోగించడం వల్ల మూత్రపిండాలు, కాలేయ పనితీరుపై ఎటువంటి విషపూరిత ప్రభావాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. గ్లూకోమన్నన్ అనేది కలబందలో ఉండే ఒక రకమైన డైటరీ ఫైబర్. ఇది నీటిలో కరిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరం ఆరోగ్య రుగ్మతలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. కలబందలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు సూక్ష్మపోషకాలు శరీరంలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను తటస్థీకరిస్తుంది. అలాగే అలోవెరాలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి, ఇవి బ్యాక్టీరియా, ఫంగల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్‌లను నియంత్రిస్తాయి.