Kidney Stones : కిడ్నీల్లో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండటమే మంచిది!

కిడ్నీల్లో రాళ్ల‌ను క‌రిగించ‌డానికి సిట్ర‌స్ జాతి ఫ‌లాలు ఎంత‌గానో తోడ్ప‌డుతాయి. సిట్రిక్ ఆమ్లం మూత్రంలోని కాల్షియంతో బంధం ఏర్ప‌రుచుకొని కాల్షియం ఆక్స‌లేట్ రాళ్లు ఏర్ప‌డ‌కుండా నిరోధిస్తుంది. నిమ్మ వంటి సిట్ర‌స్ పండ్ల‌ను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం ద్వారా కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు.

Kidney Stones : కిడ్నీల్లో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండటమే మంచిది!

It is better to stay away from these to avoid the problem of kidney stones!

Kidney Stones : జీవ‌న శైలీలో మార్పులు, ఆహార అల‌వాట్ల కార‌ణంగా అనారోగ్య స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. వాటిలో కిడ్నిల్లో రాళ్లు ఏర్ప‌డ‌టం కూడా ఒకటి. కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌టం అనేది అంద‌రినీ వేధిస్తున్న స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింది. మ‌న శ‌రీరంలో శోషించుకోకుండా మిగిలిపోయిన ఖ‌నిజ ల‌వ‌ణాలు మూత్రంలో రాళ్లుగా ఏర్ప‌డ‌తాయి. మూత్రంలో కాల్షియం, ఆక్స‌లేట్‌ల స్ఫ‌టికాల‌నే రాళ్లుగా పిలుస్తారు. ఈ రాళ్ల‌ను వివిధ చికిత్సా ప‌ద్ధ‌తుల ద్వారా తొల‌గించ‌వ‌చ్చు. అంతదూరం రాకుండా ఉండాలంటే అయితే కొన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార నియ‌మాల‌ను పాటిస్తుంటే కిడ్నీల్లో రాళ్ల‌ను నియంత్రించ‌వ‌చ్చు.

కిడ్నీల్లో రాళ్ల‌ రాకుండా ఉండేందుకు ;

త‌గినంత ప‌రిమాణంలో నీళ్లు త్రాగ‌డం ద్వారా మ‌న శ‌రీరం నుంచి ఈ రాళ్ల‌ను వెళ్ల‌గొట్ట‌వ‌చ్చు. కిడ్నీల్లో రాళ్ల‌ను త‌గ్గించ‌డానికే గాకుండా మీరు ఫిట్‌గా ఉండేందుకు కూడా నీళ్ల‌ను త్రాగ‌డం మంచిది. నీళ్ల‌ను తాగుతున్నామా లేదా అన్న విష‌యాన్ని మూత్రం రంగును బ‌ట్టి క‌నుక్కోవ‌చ్చు. మూత్రం ఎలాంటి రంగు లేకుండా ఉన్న‌ట్ల‌యితే స‌రైన మోతాదులోనే నీళ్ల‌ను తాగుతున్న‌ట్లు అర్థం. ఒక వేళ మూత్రం రంగు మారిందంటే నీళ్ల ప‌రిమాణాన్ని పెంచాల‌న్న మాట‌.

కిడ్నీల్లో రాళ్ల‌ను క‌రిగించ‌డానికి సిట్ర‌స్ జాతి ఫ‌లాలు ఎంత‌గానో తోడ్ప‌డుతాయి. సిట్రిక్ ఆమ్లం మూత్రంలోని కాల్షియంతో బంధం ఏర్ప‌రుచుకొని కాల్షియం ఆక్స‌లేట్ రాళ్లు ఏర్ప‌డ‌కుండా నిరోధిస్తుంది. నిమ్మ వంటి సిట్ర‌స్ పండ్ల‌ను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం ద్వారా కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. ఆలుగ‌డ్డ‌ల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌వు. కాబ‌ట్టి ఆలుగ‌డ్డ‌ల‌ను మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే కిడ్నీల్లో రాళ్లు చేర‌వు. ఉప్పు ప‌రిమాణాన్ని తగ్గిస్తే, మూత్రంలో కాల్షియం ప‌రిమాణం తగ్గుతుంది.

ఆహారంలో త‌గినంత‌గా కార్బోహైడ్రేట్లు ఉన్న‌ట్ల‌యితే, ఫ్ర‌క్జోజ్ ప‌రిమాణం నియంత్రించాలి.  ఫ్రక్జోజ్ ఉన్న ప‌దార్థాల‌ను అధికంగా తిన్న‌ట్ల‌యితే కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. మాంసంలో జంతు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డినా, ఏర్ప‌డ‌క‌పోయినా జంతు ప్రోటీన్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం మాత్రం సరైంది కాదని గుర్తుంచుకోవాలి.

గుడ్ల‌లో కూడా జంతు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కిడ్నీల్లో రాళ్లున్నా లేదా మొద‌టి ద‌శ‌లో కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డేఅవ‌కాశ‌మున్నా డాక్డ‌ర్లు గుడ్ల‌ను తిన‌వ‌ద్ద‌ని స‌ల‌హా ఇస్తారు. కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌టానికి కార‌ణ‌మైన ఆక్స‌లేట్ ఖ‌నిజాలుంటాయి. ఇవి రాళ్ల‌ను త‌గ్గించ‌డం మాట అటుంచి ఇంకా పెంచుతాయి. కాబట్టి కిడ్నీల్లో రాళ్ల‌తో బాధ‌ప‌డేవారు పాల‌కూర‌కు దూరంగా ఉంటే మంచిది.