ఇదే అతడి హెల్త్ సీక్రెట్: ఏడాదిగా బొద్దింకలే ఆహారం
రుచికరమైన భోజనం అంటే అందరి నోరు ఊరిపోతుంది. ముఖ్యంగా బిర్యానీ వంటి వెరైటీ డిషెస్ కనిపిస్తే లొట్టలేసుకొని తినేస్తారు.

రుచికరమైన భోజనం అంటే అందరి నోరు ఊరిపోతుంది. ముఖ్యంగా బిర్యానీ వంటి వెరైటీ డిషెస్ కనిపిస్తే లొట్టలేసుకొని తినేస్తారు.
రుచికరమైన భోజనం అంటే అందరికి నోరు ఊరిపోతుంది. ముఖ్యంగా బిర్యానీ వంటి వెరైటీ డిషెస్ కనిపిస్తే లొట్టలేసుకొని తినేస్తారు. అదే బిర్యానీలో బొద్దింకో.. ఏదైన కీటకం కనిపిస్తే.. వెంటనే ఛీ.. అని పారేస్తాం. ఆ భోజనాన్ని తిననే తినం. మరి ఆ కీటకాలతోనే భోజనమంటే మాటలా? ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు ఏకంగా ఏడాదిపాటు బొద్దింకలే భోజనంగా ఆరంగిస్తున్నాడట. జపాన్ కు చెందిన 25ఏళ్ల యుక్త శిన్హోరా అనే కుర్రాడు కీటకాలను తినే బతికేస్తున్నాడు. అదే తన హెల్త్ సీక్రెట్ గా చెప్పుకొస్తున్నాడు. సీజన్ వైజుగా దొరికే కీటకాలను సేకరించి పొట్ట నింపుకుంటున్నాడు. ఎండాకాలం వచ్చిందంటే ప్రతిరోజు కీటకాలే తన ఆహారం. వారానికి రెండురోజుల కీటకాలనే భుజిస్తాడట. చలికాలంలో కీటకాలు దొరకపోతే.. వారానికి ఒకసారి మాత్రమే వాటిని భుజిస్తానని ఓ ఇంటర్యూల్లో చెప్పుకొచ్చాడు. మిగిలిన కీటకాలను షాపుల్లో అమ్మేస్తున్నాడు.
రుచికరమైన డిషెస్ తయారుచేసి కాక్ టైల్ ఈవెంట్స్ లకు సప్లయి చేస్తున్నాడు. ప్రకృతిలో కనిపించే ప్రతి కీటకాన్ని తాను ప్రేమిస్తానని, వాటిని దగ్గరకు తీసుకొని పెంచుతానని చెప్పుకొచ్చాడు. కీటకాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి యూనైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఓ కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని చదవిన అతడు.. అప్పటినుంచి కీటకాలను తిని బతికేస్తున్నాడట. రెండేళ్ల వయస్సు నుంచే బల్లి తినడం ఆరంభించిన శిన్హోరా.. మెల్లగా వానపాములు, బొద్దింకలను ఆరగించడం మొదలు పెట్టాడు.
బొద్దింకతో డేటింగ్..
యుక్త శిన్హోరా అనే 25ఏళ్ల జపాన్ కుర్రాడు.. ఏడాది పాటు ఓ కీటకంతో డేటింగ్ చేశాడట. ఆ కీటకం ఏదో కాదు.. బొద్దింక. లీసా అనే పేరు కూడా పెట్టాడు. ప్రతి ఇంట్లో కిచెన్ రూంలో కనిపించే ఈ బొద్దెంక అంటే చాలామందికి అసహ్యం. చూస్తూనే భయంతో దూరంగా పారిపోతాం. అలాంటి ఈ బొద్దింకతోనే ఏడాదిపాటు డేటింగ్ చేశానని జపనీస్ కుర్రాడు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ఏడాదికాలంలో బొద్దింకతో సాగిన ప్రేమాయణంపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. లీసాతో కలిసి ఉన్నప్పుడు తనతో రొమాన్స్ చేస్తున్నట్టుగా ఊహించుకునేవాడట.
‘లీసా’ చనిపోయిందని..
చివరిలో మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఏడాది పాటు సాగిన డేటింగ్ లో తన ప్రేయసి బొద్దింక చనిపోయిందట. అది తట్టుకోలేని అతడు.. చచ్చిన ఆ బొద్దింకను అలానే తినేశాడట. మీరు విన్నది నిజమే. ఎందుకు అలా చేశావు అని అడిగితే.. తన కడుపులోనైనా బొద్దింక బతుకుందని చెబుతున్నాడు. ఇటీవల యూనైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా కీటకాల ఆరంగింపుపై ప్రచారం చేస్తోంది. ఈ సందర్భంగా జపనీస్ కుర్రాడు యుక్త శిన్హోరా బొద్దింక డేటింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
కీటకాలకు కజిన్..
అప్పటినుంచి దేశవ్యాప్తంగా కీటకాలకు ఇతగాడు కజిన్ గా మారిపోయాడు. బొద్దింకలు, వానపాములు వంటి కీటకాలతో వండిన వంటకాలను కాక్ టైల్ పార్టీలు, డిసర్ట్ ఈవెంట్లో వడ్డిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. బొద్దింకతో కలిసి దిగిన ఫొటోను కూడా యువకుడు శిన్హోరా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లంతా ఇదేరా ప్రేమంటే..ఎంత ఘాటు ప్రేమో.. వెర్రి కాకపోతే.. కీటకాలతో డేటింగ్ ఏంటిరా బాబూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.