Melt Fat : పది ఆహారాలతో కొ్వ్వు కరిగించేయండి!…

జీర్ణక్రియల పనితీరును మెరుగు పర్చటంలో గోధుమ గడ్డి అమోఘంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వులను క్రమేపి తగ్గించేందుకు సహాయపడుతుంది.

Melt Fat : పది ఆహారాలతో కొ్వ్వు కరిగించేయండి!…

Fat

Melt Fat : శరీరానికి అవసరమైన మేరకే ఆహారాన్ని అందించాలి. అలా కాకుండా అధిక మోతాదులో ఆహారం తీసుకుంటే అదికాస్త అధిక కొవ్వుకు దారి తీస్తుంది. తద్వారా అధిక బరువు, ఊబకాయం సమస్య తలెత్తుతుంది. శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కరిగించుకోవాలి. లేకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు చుట్టుముడతాయి. కొవ్వును మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్ధాల ద్వారానే సులభంగా కరిగించవచ్చు. కొవ్వును కరిగించేందుకు తీసుకోవాల్సిన పది రకాల ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాం…

1.ఆపిల్ ; రోజుకొక ఆపిల్ పండు తినటం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే రోజుకో యాపిల్ పండు తింటే డాక్టర్ తో కూడా పనిలేదంటారు నిపుణులు. యాపిల్ లో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వులను కరిగించేందుకు దోహదపడతాయి.

2.పచ్చిమిరపకాయలు ; పచ్చిమిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే పదార్ధం వల్ల శరీర ఎదుగుదల సహకరించే కణాల అభివృద్ధికి, నిల్వ ఉన్న కేలరీల తరుగుదలకు ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది.

3.వెల్లుల్లి ; వెల్లుల్లిలోని ఆలిసిన్ అనే రసాయనం యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి సహాయపడుతుంది.

4.డార్క్ చాక్లెట్ ; డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లవనాయిడ్స్ బాధ నివారణకారకాలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గిస్తాయి. రక్తంలోని సెరోటోనిన్ పెరుగుదలకు , కొవ్వును కరిగించటానికి ఉపయోగపడతాయి.

5.టమాటో ; మనం తీసుకునే ఆహారంలో టమాటోలను చేర్చుకోవటం వల్ల క్యాన్సర్ ను కలిగించే కణాలను నాశనం చేస్తుంది. కొవ్వును త్వరగా కరిగించేందుకు ఇది ఉపకరిస్తుంది.

6.గోధుమ గడ్డి ; జీర్ణక్రియల పనితీరును మెరుగు పర్చటంలో గోధుమ గడ్డి అమోఘంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వులను క్రమేపి తగ్గించేందుకు సహాయపడుతుంది.

7.గ్రీన్ టీ ; బరువు తగ్గటానికి ఎంతో ఉత్తమైనది గ్రీన్ టీ. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లు శరీర బరువును క్రమపద్దతిలో ఉంచుతాయి. రోజు రెండు కప్పుల గ్రీన్ టీ తాగటం వల్ల కొవ్వులు కరిగిపోతాయి.

8.తేనె ; కొవ్వును కరిగించే పదార్ధాలలో తేనె ముఖ్యమైనది. గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని ప్రతిరోజు పరగడుపున తీసుకోవటం వల్ల కొవ్వులు కరిగిపోతాయి.

9.గుడ్లు ; ప్రొటీన్లు కోడిగుడ్లలో అధికంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్ధాయిలు తగ్గుతాయి. కండరాలకు బలం చేకూరుతుంది.

10.ఓట్స్ ; రుచికే కాకుండా ఆరోగ్యానికి ఓట్స్ ఎంతో ఉత్తమమైనవి. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గిస్తుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది. తక్కువ తినాలన్న బావన కలిగిస్తుంది. తద్వారా కొవ్వులు కరిగేందుకు అవకాశం ఉంటుంది.