Snacks : చిరుతిళ్లతో రోజంతా గడిపేస్తున్నారా?…

చిరుతిండి తినే అలవాటు ఊబకాయానికి దారితీస్తుంది. వాటి రుచి కారణంగా మోతాదుకు మించి తినాలన్న కోరిక కలుగుతుంది.

Snacks : చిరుతిళ్లతో రోజంతా గడిపేస్తున్నారా?…

Many Types Of Savoury Snack In White Dishes

Snacks : రోజు మొత్తం చిరుతిళ్లతో కాలం గడిపేస్తుంటారు చాలా మంది. ఎప్పుడు నోట్లో ఏదో ఒకటి నములు తూనే ఉంటారు. అయితే ఇలా తినటం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. స్వీటు, కారతో కూడిన చిరుతిళ్ల కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పనమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

చిరుతిళ్ల కారణంగా రక్తంలో ట్రైగ్లిజరైడ్ల పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల స్వీట్ల కారణంగా ప్లేట్ లెట్ కణాలు జిగురుగా మారతాయి. తద్వారా రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరుగుతాయి. ఫలితంగా గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటుంది. చిరుతిళ్లు తినే వారిలో రక్తంలో గ్లూకోజు పెరుగుతుంది. ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది.

చిరుతిండి తినే అలవాటు ఊబకాయానికి దారితీస్తుంది. వాటి రుచి కారణంగా మోతాదుకు మించి తినాలన్న కోరిక కలుగుతుంది. అతిగా తినటం వల్ల బరువు పెరిగిపోతారు. శరీరంలో రక్తం సరఫారా వ్యవస్ధ అస్తవ్యస్ధంగా మారే అవకాశాలు ఉంటాయి. జీర్ణప్రక్రియలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అజీర్తి , గ్యాస్ , ఛాతిలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేపనిగా చిరుతిళ్లు నమిలితింటుండటం వల్ల పళ్లపైన ఉండే ఎనామిల్ దెబ్బతిని పోతుంది. దంతాలు క్షీణించే ప్రమాదం ఉంటుంది.