Stomach Problem : పొట్ట సమస్య బాధిస్తుందా!…పరిష్కారం మీచేతుల్లో?…

పొట్టను తగ్గించుకోవాలంటే పీచు అధికంగా ఉండే బీన్స్‌, బ్రకలీ, బెర్రీ పండ్లు, అవకాడో, యాపిల్‌, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

Stomach Problem : పొట్ట సమస్య బాధిస్తుందా!…పరిష్కారం మీచేతుల్లో?…

Stomach Problem

Updated On : February 3, 2022 / 10:24 AM IST

Stomach Problem : పొట్ట సమస్య చాలా మందిని బాధిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్‌-ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు అలవాటు పడడం వంటి వాటి వల్ల పొట్ట చుట్టూ కొవ్వులు పేరుకుపోతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్‌ సమస్యల వల్ల చాలా మందిలో బానపొట్ట బాధిస్తుంది. అంతేకాకుండా ఆహారపుటలవాట్లు, జీవనశైలి మార్పులు శరీరంలో హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల ఆందోళన , వత్తిడులు ఏర్పడతాయి. దీని వల్ల కూడా పొట్ట లావుగా కనిపిస్తుంది.

పొట్టను తగ్గించుకోవాలంటే పీచు అధికంగా ఉండే బీన్స్‌, బ్రకలీ, బెర్రీ పండ్లు, అవకాడో, యాపిల్‌, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇందులోని ఫైబర్‌ తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.  నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటితో పాటు పొట్టపై ఒత్తిడి పడే కోర్‌ వ్యాయామాలు, బరువులెత్తడం, మెట్లెక్కడం.. వంటివి సాధన చేయచ్చు. తద్వారా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరగడంతో పాటు అక్కడి కండరాలు కూడా దృఢమవుతాయి.

పొట్ట సమస్యకు చక్కని పరిష్కారంగా యోగా, ధ్యానం.. వంటివాటిని నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్యకరమైన కొవ్వులు నిండి ఉండే జంక్‌ ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, నూనె సంబంధిత పదార్థాలను దూరం పెడితే పొట్ట సమస్య సంగం తగ్గినట్టేనని చెప్పవచ్చు. పొట్ట పెరిగిపోవడానికి కారణమేదైనా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, తీసుకునే ఆహారంలో చక్కెర తగ్గించడం, వ్యాయామాలు చేయడం వంటి వాటి వల్ల సమస్యను పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుంది.