Weight Loss: బరువు తగ్గాలనుకుంటే ఈ ఫ్రూట్స్ మాత్రం తప్పక తీసుకోవాలి

బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు.. పెరగకుండా చూసుకోవాలనుకునేవారు తీసుకునే ఆహారంలో విటమిన్ సీ కచ్చితంగా తీసుకోవాలి. బరువు తగ్గేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యే కారణాల్లో విటమిన్ సీ లోపం ఒకటి.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటే ఈ ఫ్రూట్స్ మాత్రం తప్పక తీసుకోవాలి

Weight Loss

Weight Loss: బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు.. పెరగకుండా చూసుకోవాలనుకునేవారు తీసుకునే ఆహారంలో విటమిన్ సీ కచ్చితంగా తీసుకోవాలి. బరువు తగ్గేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యే కారణాల్లో విటమిన్ సీ లోపం ఒకటి. ఎందుకంటే విటమిన్ సీ ఉండే పండ్లు, కూరగాయల్లో ఉండే విటమిన్ సిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

రోజూ దానికి తగ్గ పండ్లు, కూరగాయలు తింటే సరిపడా విటమిన్ సి అందుతుంది. అస్కార్బిక్ యాసిడ్‌గా పిలిచే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

* బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉంటే.. కచ్చితంగా విటమిన్ సి ఉండే పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి.

* విటమిన్ సి వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇదొకటి. అంతేకాకుండా గుండెకు మేలు చేయడం, కాన్సర్ వచ్చే అవకాశాల్ని తగ్గించడం, చర్మాన్ని కాంతివంతంగా చేయడం, ఎముకలను బలంగా ఉంచుతుంది.

* శరీరంలోని కొవ్వు కణాల నుంచి శక్తి ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలా కొవ్వు కణాలు పెరగకుండా ఉంటాయి. విటమిన్ సీ లోపం ఉంటే మాత్రం ఆటోమేటిక్‌గా నడుం చుట్టూ… రింగులా కొవ్వు పేరుకుపోయి… పొట్ట తయారవుతుంది.

* ఉసిరి, నారింజ, నిమ్మకాయ, కివీ, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, జామకాయ, మామిడికాయ, స్ట్రాబెర్రీ, బ్రకోలీ, మొలకలు, కాలీఫ్లవర్, బంగాళాదుంపల్లో విటమిన్ సీ ఎక్కువగా దొరుకుతుంది.

* వర్కౌట్స్‌తో పాటు విటమిన్ సీ ఉండే ఆహారం మాత్రం నిర్లక్ష్యపెట్టకూడదు. విటమిన్ సీ మగవాళ్లు రోజూ 90 మిల్లీగ్రాముల తీసుకుంటే.. మహిళలు 75 మిల్లీగ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది. మంచి చేస్తుంది కదా అని ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే.