Children Care : మీ పిల్ల‌లు తినమంటే మారాం చేస్తున్నారా.. ఇదిగో టిప్స్..!

Children Care : మీ ఇంట్లో పిల్లలు తినమంటే మారాం చేస్తున్నారా? సాధారణంగా పిల్లలు తినమంటే తినరు.. వారికి అన్నం తినిపించాలంటే చాలా కష్టమే మరి.

Children Care : మీ పిల్ల‌లు తినమంటే మారాం చేస్తున్నారా.. ఇదిగో టిప్స్..!

What Can You Do If Your Child Refuses To Eat Anything

Updated On : May 25, 2022 / 8:35 AM IST

Children Care : మీ ఇంట్లో పిల్లలు తినమంటే మారాం చేస్తున్నారా? సాధారణంగా పిల్లలు తినమంటే తినరు.. వారికి అన్నం తినిపించాలంటే చాలా కష్టమే మరి. వారిని సముదాయిస్తూ.. గోరుముద్దలు కలిపి పెట్టాలి. పిల్లలకు ఏదో ఒక మాటలు చెబుతూ వారిని మారం మాన్పించేలా చేయొచ్చు. పిల్లలు అన్నం తినకుండా ఉండటమనేది సహజమే. కానీ, చాలా మంది పిల్లల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. ఏడాది శిశువు నుంచి ఏడేళ్ల చిన్నారుల వరకు పిల్లలు అన్నం తినేందుకు మారం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను తమ దారికి తెచ్చుకోవాలంటే తల్లిదండ్రులు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలతో పిల్లల మారాన్ని మాన్పించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

పిల్లలు ఎక్కువగా తమ తల్లిదండ్రులనే అనుసరిస్తుంటారు. ఇంట్లో తల్లిదండ్రుల అలవాట్లు, వారు చేసే పనులు.. ఇలా అన్నింటిని చూసి వంటపట్టించుకుంటారు. అచ్చం వారిలాగే ప్రవర్తిస్తుంటారు. అదే పనులు చేస్తూ అల్లరి చేస్తుంటారు. పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. అందుకే పెద్దలు తమ పిల్లలకు ఏది తినిపించాలని అనుకుంటారో అది మీరు తింటూ వారికి తినిపించాలి. మీరు తినేది వారికి పెట్టండి.. అది కూడా మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఆరు నెలల వయసు తర్వాత నుంచి చిన్నారులకు ఘన పదార్థాలు ఇవ్వవచ్చు. కూరగాయలు, పండ్లు కూడా తినిపించవచ్చు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారికి తినడాన్ని ఇష్టపడేలా చేయాలి. కూరగాయలను తినిపించే సమయంలో ఆ కూరను ఒక స్టోరీగా మలిచి చెప్పాలి. అప్పుడే పిల్లలకు కూరగాయలను తినేందుకు ఆసక్తి కలుగుతుంది.

What Can You Do If Your Child Refuses To Eat Anything (1)

What Can You Do If Your Child Refuses To Eat Anything

ఇక పండ్లను తినిపించే సమయంలో వారికి నచ్చిన బొమ్మల ఆకృతిలో ముక్కలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్లు ఇష్టంగా తింటారు. పిల్లలకు ప్రధానంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి తినేలా అలవాటు చేయాలి. దాంతో వారికి బంధాలు, అనుబంధాల విలువ తెలుస్తుంది. ఏ వంట వండిన కూడా నాలుగు రకాల పదార్థాలు పిల్లలు తినేందుకు ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి ఎక్కువగా పిల్లలతో చర్చించాలి. అలాగే సరైన సమయానికి భోజనం చేసేలా పిల్లల్లో అవగాహన కల్పించాలి. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా.. పోనుపోనూ పిల్లలు మీ దారిలోకి వస్తారు.

Read Also : Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్