Reduce Stress : ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?..

రోగనిరోధక శక్తిని పెంచే సి విటమిన్‌ ఒత్తిడి, ఆందోళనను కూడా అదుపులో ఉంచుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ, ద్రాక్ష, కివి పండ్ల నుంచి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.

Reduce Stress : ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?..

Health

Reduce Stress : ఆధునిక జీవితంలో చాలామంది ఒత్తిడి, ఆందోళనకు గురువుతున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. శారీరక శ్రమ తగ్గిపోవడం, పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల ఒత్తిడి, ఆందోళన బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యపై దృష్టి పెట్టకపోతే దీర్ఘకాలంలో ఇతర తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఉండే కొన్ని రకాల పోషకాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయని పరిశోధనల్లో తేలింది. ఒత్తిడి, ఆందోళన వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల ఆకలి పెరగడం, మధుమేహం, బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. కొంతమంది ఉరుకుల, పరుగుల ఉద్యోగాలతో సతమతమవుతుంటే మరికొందరు కుటుంబ సమస్యల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఇలాంటి ఒత్తిడిని తొలగించుకోవాలంటే యోగా, ధ్యానంతో పాట మంచి డైట్‌ కూడా మెయింటెన్‌ చేయాలి.

ఒమేగా-3 సమృద్ధిగా ఉండే ఆహారాలు ఒమేగా-3 మంట, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. నెయ్యి వంటి ఆహారాలలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో ప్రతిరోజూ కనీసం 1 టీస్పూన్ నెయ్యి తీసుకోవాలని సూచించారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా లభించే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పోషకం ఎక్కువగా లభించే సాల్మన్, ట్రౌట్, మాకెరెల్ వంటి చేపలు, ఇతర సీ ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటినుంచి లభించే DHA, EPA అనే యాసిడ్లు ఒత్తిడిని దూరం చేసి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి వల్ల శరీరంలో ఏర్పడే మంటను , కార్టిసోల్ స్థాయులను కూడా ఇవి తగ్గించి ఒత్తిడిని నియంత్రిస్తాయి. చేపలలో ఉండే ఈ ఫ్యాటీ యాసిడ్లను ఎక్కువగా తీసుకుంటే డిప్రెషన్ నుండి కూడా కాపాడుకోవచ్చని పరిశోధనల్లో కనుగొన్నారు.

విటమిన్ B12, ఇతర B విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తూ, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. ముస్సెల్, క్లామ్స్, ఆయిస్టర్స్ వంటి షెల్ ఫుడ్స్‌ నుంచి విటమిన్ బి12 శరీరానికి అందుతుంది. ఇతర మాంసాహారంలో కాలేయం ఈ పోషకానికి వనరుగా ఉంటుంది. విటమిన్ బి, బి12 లోపాల వల్ల చిరాకు, బద్ధకం, డిప్రెషన్ వంటి ఒత్తిడి సంబంధిత లక్షణాలు అభివృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది. ఇవి శరీరానికి అందేలా చూసుకోవడం వల్ల మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చు. విటమిన్ బి12 శాకాహారం నుంచి పెద్దగా లభించదు. వీరు డాక్లర్ల సలహాలతో బి12 సప్లిమెంట్లు తీసుకోవాలి. ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉండే ఆహారాలు పెరుగు తినడం వల్ల ఒత్తిడి అంతా తొలగిపోతుంది. పెరుగు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియా మూలకాలను కలిగి ఉంటుంది. ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల గట్ సహజ బ్యాక్టీరియాకు ప్రయోజనం చేకూరుతుంది. ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచే సి విటమిన్‌ ఒత్తిడి, ఆందోళనను కూడా అదుపులో ఉంచుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ, ద్రాక్ష, కివి పండ్ల నుంచి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుందని పరిశోధనల్లో తేలింది. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి సమస్యను సి విటమిన్ దూరం చేసి, మనసిక అనారోగ్యాలకు దూరంగా ఉంచుతుంది. నిమ్మ, ఇతర పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటే దుష్ర్పభావాలు రావచ్చు. వీటిని పరిమితంగా తీసుకోవాలి. మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు అరటిపండ్లు, గుమ్మడికాయ గింజలు పొటాషియం, మెగ్నీషియం అద్భుతమైన మూలాలు. ఇవి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నియంత్రించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన లక్షణాలను తగ్గించుకోవచ్చు.

మెదడు పనితీరుపై ప్రభావం చూపే సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లు సహాయపడతాయి. సెరోటోనిన్ సంతోషం, వెల్‌బీయింగ్‌కు కారణమవుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి సమస్యలను దూరంచేసి, శరీరానికి, మెదడుకు తగినంత విశ్రాంతి లభించేలా చేస్తుంది. మెదడులో సెరోటోనిన్ స్థాయులు తక్కువగా ఉంటే, మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిసింది. విటమిన్ డి ఆహారాలు విటమిన్ డి లోపం ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఉదయం పూట సూర్యకాంతి పడేవిధంగా వాకింగ్‌ చేయాలి. ఇది కాకుండా విటమిన్ డి ఉన్న ఆహారాన్ని ఆహారంలో చేర్చితే ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు. 5. నానబెట్టిన ఎండుద్రాక్ష, కుంకుమపువ్వు రాత్రి నిద్రపోయే ముందు ఎండుద్రాక్షలో నానబెట్టిన 4-5 కుంకుమపువ్వు తినండి. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి.