Tees Maar Khan Trailer: తీస్‌మార్ ఖాన్ ట్రైలర్.. ఆది గట్టిగానే కొట్టేలా ఉన్నాడు!

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హిట్లు, ఫ్లాపులు తేడా లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటాడు. తాజాగా ఆది నటిస్తున్న మూవీ ‘తీస్ మార్ ఖాన్’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Tees Maar Khan Trailer: తీస్‌మార్ ఖాన్ ట్రైలర్.. ఆది గట్టిగానే కొట్టేలా ఉన్నాడు!

Updated On : August 8, 2022 / 6:39 PM IST

Tees Maar Khan Trailer: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హిట్లు, ఫ్లాపులు తేడా లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటాడు. తాజాగా ఆది నటిస్తున్న మూవీ ‘తీస్ మార్ ఖాన్’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాను ‘నాటకం’ సినిమా దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై చిత్ర వర్గాల్లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే, ఆది సాయి కుమార్ ఈసారి గ్యారెంటీగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

Tees Maar Khan: ‘తీస్ మార్ ఖాన్‌’గా దిగుతున్న ఆది..!

తీస్ మార్ ఖాన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకున్న ఆది, ఈ చిత్ర ట్రైలర్‌లో మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించి వావ్ అనిపించాడు. ఒక స్టూడెంట్‌గా, ఒక రౌడీగా, ఒక పోలీస్‌గా ఆది మూడు షేడ్స్ చూపించడంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ మరోసారి అందాల విందు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ ట్రైలర్‌లోనే అమ్మడి అందాల ఆరబోతకు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌లో సునీల్, పూర్ణాలు కీలక పాత్రల్లో నటించినట్లుగా కనిపిస్తోంది.

Tees Maar Khan: పాప ఆగవే.. ఆగి చూడవే.. టీజ్ చేస్తున్న ఆది!

యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు పవర్‌ఫుల్ డైలాగులతో కూడా ఆది ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాను ఆగస్టు 19న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో, ఈ సినిమాతో ఆది ఖచ్చితంగా హిట్ కొడతాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి. మరి తీస్ మార్ ఖాన్ సినిమాతో ఆది సాయికుమార్ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.