Aamir Khan : నా సినిమాని బాయ్‌కాట్ చేయాలి అనుకుంటే మీ సెంటిమెంట్‌ని గౌరవిస్తాను..

గతంలోనే దీనిపై స్పందిస్తూ నా సినిమాని బాయ్‌కాట్ చేయకండి అని బతిమాలాడు. తాజాగా మరోసారి లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో అమీర్ ఖాన్ దీనిపై స్పందించాడు. మీ సినిమాని బాయ్‌కాట్ చేయాలని అంటున్నారు అని ఓ విలేఖరి అడగగా అమీర్ ఖాన్ స్పందిస్తూ.......

Aamir Khan : నా సినిమాని బాయ్‌కాట్ చేయాలి అనుకుంటే మీ సెంటిమెంట్‌ని గౌరవిస్తాను..
ad

Aamir Khan :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌, కరీనా కపూర్‌, నాగ చైతన్య మెయిన్ లీడ్స్ లో ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమాని తెరకెక్కించారు. హాలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది ఈ సినిమా. నాగ చైతన్య కూడా నటిస్తుండటంతో తెలుగులో కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

అయితే ఈ సినిమాకి బాయ్‌కాట్‌ సెగ తగిలింది. ‘లాల్ ‍సింగ్‌ చడ్డా’ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం చేశారు. దీంతో ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ బాయ్‌కాట్‌ లాల్ సింగ్ చడ్డా ట్రెండింగ్ లో ఉంది. గతంలో అమీర్ ఖాన్ ఇండియాలో ఉండాలంటే రక్షణ లేదు, ఇక్కడ బతకాలంటే భయం వేస్తుంది అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా అమీర్ ని వ్యతిరేకించారు. ఇప్పుడు మరోసారి అమీర్ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఇక్కడ రక్షణ లేదు అనేవాడివి ఇక్కడ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నావు? పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ వెళ్ళు అని కామెంట్స్ చేస్తూ లాల్ సింగ్ చడ్డాని బాయ్‌కాట్‌ చేయమని ట్రెండింగ్ చేస్తున్నారు.

Bimbisara Part 2 : బింబిసార 2 స్టోరీ చెప్పేసిన కళ్యాణ్ రామ్

గతంలోనే దీనిపై స్పందిస్తూ నా సినిమాని బాయ్‌కాట్ చేయకండి అని బతిమాలాడు. తాజాగా మరోసారి లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో అమీర్ ఖాన్ దీనిపై స్పందించాడు. మీ సినిమాని బాయ్‌కాట్ చేయాలని అంటున్నారు అని ఓ విలేఖరి అడగగా అమీర్ ఖాన్ స్పందిస్తూ.. ”నేను ఎవరినైనా ఏ విధంగానైనా బాధపెట్టుంటే నేను చింతిస్తున్నాను. నేను ఎవరినీ కావాలని బాధపెట్టాలని అనుకోను. ఎవరైనా సినిమాను చూడకూడదనుకుంటే, నేను వారి సెంటిమెంట్‌ను గౌరవిస్తాను” అంటూ తెలిపారు. మరి ఈ బాయ్‌కాట్ సినిమాకి ఎంతవరకు నెగిటివ్ అవుతుందో చూడాలి.