ప్రియాంక ఫ్యామిలినీ చూస్తే గుండె కరిగిపోయింది – ఆలీ

  • Published By: madhu ,Published On : November 30, 2019 / 08:25 AM IST
ప్రియాంక ఫ్యామిలినీ చూస్తే గుండె కరిగిపోయింది – ఆలీ

శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్యపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. ఘటనను ఖండిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సినీ నటుడు ఆలీ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 2019, నవంబర్ 30వ తేదీ ప్రియాంక ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

నిర్భయ ఘటన జరిగిన అనంతరం నార్త్ ఇండియా కదిలిపోయిందనే విషయాన్ని గుర్తించారు. సిటీ నడిబొడ్డున ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రియాంక తండ్రి ఎక్స్ ఆర్మీ..దేశానికి ఎంతో సేవ చేశారని తెలిపారు. ఏ ఫ్యామిలీకి ఇలా జరగొద్దని అనుకుంటున్నానని, గుండెలపై పెంచుకున్న కూతురికి ఇలా జరగడం..చాలా బాధేస్తోందన్నారు. కనీసం శవం కూడా దొరకలేదన్నారు. ప్రియాంక చదువు కోసమే వారు హైదరాబాద్‌కు రావడం జరిగిందన్నారు. షూట్ చేయొద్దు..ఉరి తీయొద్దు..తన కూతురికి ఏమి జరిగిందో..వారికి అదే జరగాలని తల్లి కోరుతోందన్నారు. నిందితులకు సహాయం చేయవద్దని బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిసిందని..దీనిని స్వాగతిస్తున్నట్లు ఆలీ చెప్పారు. 

> ప్రియాంకరెడ్డి హత్య కేసును 24 గంటల్లో చేధించారు పోలీసులు. 
> నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
> డ్రైవర్లు పాషా, నవీన్, క్లీనర్లు కేశవులు, శివలు అరెస్టయిన వారిలో ఉన్నారు.
> లారీ నెంబర్ (టీఎస్ 07యూఏ 3335) ద్వారా నిందితులను పట్టుకున్నారు. 
> నిందితులు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారీగా గుర్తించారు. 
> ప్రధాన నిందితుడు ఎండీ పాషాగా గుర్తించారు. 
> ప్రియాంకపై నిర్మానుష్య ప్రాంతంలో లారీ డ్రైవర్, క్లీనర్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. 
> లారీ రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిగా గుర్తించారు. 
> నిందితులు వాడిన లారీపై 4 పెండింగ్ చలాన్లు ఉన్నాయి.
> రాంగ్ పార్కింగ్, నో ఎంట్రీ, ర్యాష్ డ్రైవింగ్ కింద చలాన్లున్నాయి. 
Read More : ప్రియాంక హంతకులను మేమే చంపేస్తాం : షాద్ నగర్ లో హైటెన్షన్