Nayanthara : 50 సెకన్ల యాడ్‌ కోసం నయనతార అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?

దేశంలోనే అత్యంత సంపన్నులైన నటీమణుల్లో నయనతార ఒకరట. కొన్ని నివేదికల ప్రకారం నయనతార 50 సెకన్ల ప్రకటనలో నటించడానికి రూ.5 కోట్లు వసూలు చేస్తారట.

Nayanthara : 50 సెకన్ల యాడ్‌ కోసం నయనతార అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?

Nayanthara

Updated On : September 28, 2023 / 1:57 PM IST

Nayanthara :  ‘జవాన్’ సినిమాలో షారూఖ్ ఖాన్ పక్కన మెరిసిన నయనతార ఇండియాలోనే అత్యంత ధనికులైన నటీమణుల్లో ఒకరట. కొన్ని నివేదికల ప్రకారం 38 ఏళ్ల నయనతార 50 సెకన్ల యాడ్ కోసం రూ.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తారట. మీరు విన్నది నిజమే.

Nayanthara Vigneh Shivan Children : నయనతార – విగ్నేష్ శివన్ కవల పిల్లలను చూశారా? అప్పుడే వన్ ఇయర్ వచ్చేసింది..

నయనతార ఒక యాడ్ లో కనిపించినందుకు రూ.4 నుంచి రూ.7 కోట్ల రూపాయలు తీసుకుంటారట. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరైన నయనతార ఆస్తులు రూ.200 కోట్లకు పైమాటే అట. ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నశిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ వంటి నటీమణుల్లో నయనతార కూడా ఉన్నారు. నయన్ దగ్గర రూ.50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. నయనతార, భర్త విఘ్నేశ్ శివన్ వృత్తిపరమైన పనులు, విహార యాత్రల కోసం ఈ ప్రైవేట్ జెట్ ను వాడతారట. నయనతారకు చెన్నై, హైదరాబాద్ లలో ఖరీదైన ఇళ్లు ఉన్నాయట, కేరళలో వంశపారంపర్యంగా వస్తున్న ఇళ్లతోపాటు కేరళ, తమిళనాడులో స్థలాలు కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి.

Kannappa Movie : ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్‌తో పాటు నయనతార కూడా..? మంచు విష్ణు గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నాడుగా..

2006 లో ‘లక్ష్మీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో కనిపించారు. ప్రస్తుతం నయన్ పాట్టు, లేడీ సూపర్ స్టార్ 75, ది టెస్ట్, ఇరైవన్, డియర్ స్టూడెంట్స్, తని ఒరువన్ 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.