Saakini Daakini: ‘శాకినీ డాకినీ’ల కోసం వస్తున్న మేజర్ అండ్ లేడీ డైరెక్టర్

అందాల భామలు రెజీనా కాసాండ్రా, నివేథా థామస్ కలిసి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘శాకినీ డాకినీ’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Saakini Daakini: ‘శాకినీ డాకినీ’ల కోసం వస్తున్న మేజర్ అండ్ లేడీ డైరెక్టర్

Adivi Sesh Nandini Reddy As Guests For Saakini Daakini Pre-Release Event

Saakini Daakini: అందాల భామలు రెజీనా కాసాండ్రా, నివేథా థామస్ కలిసి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘శాకినీ డాకినీ’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది.

Saakini Daakini : శాకిని డాకిని ప్రమోషన్స్ లో నివేదా, రెజీనా..

ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా యంగ్ హీరో అడివి శేష్, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్‌లో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సందర్భంగానే చిత్ర ట్రైలర్‌ను కూడా చిత్ర యూనిట్ లాంఛ్ చేయనున్నారు. ఈ సినిమాలో రెజీనా, నివేథాలు తమ పాత్రలతో ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Saakini Daakini Teaser : శాకిని డాకిని టీజర్.. అదరగొట్టేసిన నివేదా థామస్, రెజీనా కసాండ్రా..

ఇక ఈ సినిమా కొరియన్ మూవీ ‘మిడ్‌నైట్ రన్నర్స్’కు తెలుగు రీమేక్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించింది. మరి ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.