Saakini Daakini Teaser : శాకిని డాకిని టీజర్.. అదరగొట్టేసిన నివేదా థామస్, రెజీనా కసాండ్రా..
నివేదా థామస్, రెజీనా కసాండ్రా ముఖ్య పాత్రల్లో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శాకిని డాకిని. ఈ సినిమా దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం................

saakini daakini teaser released
Saakini Daakini Teaser : నివేదా థామస్, రెజీనా కసాండ్రా ముఖ్య పాత్రల్లో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శాకిని డాకిని. ఈ సినిమా దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.
ఈ టీజర్ లో.. నివేదా ఫుడ్ లవర్ గా, రెజీనా ఓసిడి ఉన్న అమ్మాయిల్లా చూపించారు. వీరు ఒక పోలీస్ అకాడమీలో శిక్షణకి వస్తే అక్కడ వీళ్ళు ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి, వీళ్లిద్దరి మధ్య మొదట వైరం ఉన్నట్టు, తర్వాత వీళ్ళిద్దరూ కలిసినట్టు, తర్వాత వీళ్ళిద్దరితో మాస్ ఫైట్ సీన్స్ చూపించారు. టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. కొరియన్ సినిమాని రీమేక్ చేస్తున్నా మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం కెరీర్ లో స్లోగా ఉన్న రెజీనా, నివేదాలకు ఈ సినిమా బాగా ప్లస్ అవుతుందని అనుకోవచ్చు. ఈ శాకిని డాకిని సినిమాని సెప్టెంబర్ 16న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్.