Agent Movie: ఏజెంట్ మూవీ రన్‌టైమ్ లాక్ చేసిన సురేందర్ రెడ్డి.. ఎంతో తెలుసా?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ రన్‌టైమ్‌ను 2 గంటల 32 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్.

Agent Movie: ఏజెంట్ మూవీ రన్‌టైమ్ లాక్ చేసిన సురేందర్ రెడ్డి.. ఎంతో తెలుసా?

Agent Movie Locks Interesting Runtime

Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ చిత్రంగా తీర్చిదిద్దడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈచిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఏప్రిల్ 18న ఈ చిత్ర ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Agent Movie Promotions : ఏజెంట్ ప్రమోషన్స్ కోసం 172 అడుగుల మీద నుంచి దూకిన అఖిల్.. ఫొటోలు..

ప్రస్తుతం టాలీవుడ్ ఏజెంట్ మేనియాతో ఊగిపోతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను చిత్ర యూనిట్ వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ రన్‌టైమ్‌ను 2 గంటల 32 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్. ఫైనల్ కట్‌లో ఈ రన్‌టైమ్ 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుందని ఏజెంట్ టీమ్ చెబుతోంది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Agent Movie : ఏజెంట్ సినిమాను కొనడానికి ఎవ్వరూ రావట్లేదా? నిర్మాత అనిల్ సుంకర కామెంట్స్..

ఈ సినిమాలో అఖిల్ చేసిన డేరింగ్ స్టంట్స్ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తాయని వారు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇక ఇవాళ సాయంత్రం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కానుండటంతో ఈ ట్రైలర్ ఎలా కట్ చేశారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాలో ఏజెంట్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.