Amitabh Bachchan : తన ఇమేజ్‌ని వాడుకుంటున్నారు అంటూ.. కోర్ట్‌ని ఆశ్రయించిన అమితాబ్..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన పేరుని వాడుకుంటున్నారంటూ ఢిల్లీ కోర్ట్‌ని ఆశ్రయించాడు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న సినీ, స్పోర్ట్స్ సెలెబ్రెటీస్ ఫోటోలను.. కొంతమంది వారి వ్యాపారం కోసం వాడుకుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే ఏకంగా ఆ సెలెబ్రెటీస్ పేరు మీద ఒక వెబ్ సైట్‌నే నడుపుతుంటారు. అటువంటి అనుభవానే అమితాబ్ కూడా ఎదుర్కొన్నాడు.

Amitabh Bachchan : తన ఇమేజ్‌ని వాడుకుంటున్నారు అంటూ.. కోర్ట్‌ని ఆశ్రయించిన అమితాబ్..

Amitabh Bachchan's Voice, Image Can't Be Used Without Permission

Updated On : November 25, 2022 / 2:37 PM IST

Amitabh Bachchan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన పేరుని వాడుకుంటున్నారంటూ ఢిల్లీ కోర్ట్‌ని ఆశ్రయించాడు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న సినీ, స్పోర్ట్స్ సెలెబ్రెటీస్ ఫోటోలను.. కొంతమంది వారి వ్యాపారం కోసం వాడుకుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే ఏకంగా ఆ సెలెబ్రెటీస్ పేరు మీద ఒక వెబ్ సైట్‌నే నడుపుతుంటారు. అటువంటి అనుభవానే అమితాబ్ కూడా ఎదుర్కొన్నాడు.

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ నిర్మించిన ఏకైక తెలుగు సినిమా.. ఏంటో తెలుసా?

అమితాబ్ అధికారిగా పలు బ్రాండ్ లకు ప్రమోటర్ గా పని చేస్తుంటాడు. అయితే అయన అనుమతి లేకుండా కొంతమంది అయన ఫొటోతో ఉన్న టీ షర్ట్స్ అమ్మడం, అలాగే amitabhbachchan.com అనే వెబ్ సైట్ ని కూడా రిజిస్టర్ చేయడంతో, అమితాబ్.. తన పేరుని తన అనుమతి లేకుండా వాడుకుంటున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు.

అమితాబ్ బచ్చన్ పేరు, ఇమేజ్ లేదా వాయిస్‌ని ఆయన అనుమతి లేకుండా ఉపయోగించరాదని నటుడి పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అటువంటి ప్రొడక్ట్స్ ని మరియు కంటెంట్‌ను తొలగించాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోర్టు ఆదేశాలు జారీ చేసింది.