Aparna Balamurali : లావుగా ఉన్నానని 27 ఏళ్లకే తల్లి పాత్రలు చేయమని అడుగుతున్నారు..
అపర్ణ బాలమురళి మాట్లాడుతూ.. ''నేను లావుగా ఉన్నానని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక కొంతమంది సినిమా వాళ్ళైతే నేను లావుగా ఉన్నానని 27 ఏళ్లకే తల్లి పాత్రలు చేయమని.........

Aparna Balamurali fires on asking mother roles
Aparna Balamurali : ‘ఒరు సెకండ్ క్లాస్ యాత్ర’ అనే మలయాళం సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది మలయాళీ భామ అపర్ణ బాలమురళి. ఆ తర్వాత చాలా మలయాళం సినిమాల్లో నటించింది. తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సినిమాలు చేస్తుంది. సూర్య సరసన తమిళ్ లో సూరారైపోట్రు సినిమాతో దేశమంతటా పాపులారిటీ సంపాదించుకుంది. అదే సినిమా తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అంటూ రిలీజ్ అవ్వగా ఇక్కడి ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది అపర్ణ.
‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకి తన నటనతో అందర్నీ మెప్పించి నేషనల్ అవార్డు కూడా సాధించింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది అబ్బాయిలు తమకి ఇలాంటి అమ్మాయిలే భార్యగా రావాలి అనుకున్నారంటే ఆ పాత్ర ఎంత బాగా క్లిక్ అయిందో అర్ధమవుతోంది. ప్రస్తుతం కొన్ని మలయాళం, తమిళ్ సినిమాల్లో చేస్తున్న అపర్ణ బాలమురళి తాజాగా ఓ తమిళ్ సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఫైర్ అయింది.
అపర్ణ బాలమురళి మాట్లాడుతూ.. ”నేను లావుగా ఉన్నానని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక కొంతమంది సినిమా వాళ్ళైతే నేను లావుగా ఉన్నానని 27 ఏళ్లకే తల్లి పాత్రలు చేయమని అడుగుతున్నారు. మన బరువుకి, ప్రతిభకి సంబంధం ఉందా?. నాకు తల్లి పాత్రలు చేసే వయస్సు ఇంకా రాలేదు. అనారోగ్య కారణాల వల్లో, లేక వేరే ఏదైనా కారణాల వల్లో బరువు పెరగొచ్చు, తగ్గొచ్చు. దానికి ప్రతిభకి లింక్ పెడితే ఎలా?, అయినా నేను లావుగా ఉన్నా చాలా మంది నటిగా నన్ను అంగీకరిస్తున్నారు” అంటూ ఫైర్ అయింది.