BiggBoss 6 Day 11: ఏడుపులు, ఎమోషనల్స్ తో నిండిపోయిన బిగ్‌బాస్.. వీళ్ళ కథలు వింటే మీరు కూడా ఏడవాల్సింది..

బిగ్‌బాస్ పదకొండో రోజు హౌస్ అంతా ఏడుపులతో, ఎమోషన్స్ తో సాగిపోయింది. బేబీ టాస్క్ ఇవ్వడంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లైఫ్ లోని దానికి రిలేటెడ్ గా బాధాకరమైన సన్నివేశాలని షేర్ చేసుకోమనడంతో..............

BiggBoss 6 Day 11: ఏడుపులు, ఎమోషనల్స్ తో నిండిపోయిన బిగ్‌బాస్.. వీళ్ళ కథలు వింటే మీరు కూడా ఏడవాల్సింది..

BiggBoss 6 Day 11:  బిగ్‌బాస్ పదకొండో రోజు హౌస్ అంతా ఏడుపులతో, ఎమోషన్స్ తో సాగిపోయింది. బేబీ టాస్క్ ఇవ్వడంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లైఫ్ లోని దానికి రిలేటెడ్ గా బాధాకరమైన సన్నివేశాలని షేర్ చేసుకోమనడంతో కంటెస్టెంట్స్ వారి వారి బాధలని షేర్ చేసుకొని కన్నీళ్లు తెప్పించారు. సుదీప, కీర్తి, రేవంత్ లు చెప్పిన మాటలకు హౌస్ మెంబర్స్ తో పాటు ఎపిసోడ్ చూసిన వాళ్ళు కూడా కంటతడి పెట్టారు.

సుదీప మాట్లాడుతూ.. తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల తన ప్రెగ్నెన్సీ పోయిందని బాధపడింది. తన చెల్లి కూతురు వచ్చేదాకా తనకు పిల్లలు లేరన్న బాధ ఉండేది అని, తనకి పిల్లలు కావాలని, అందుకే బేబీ టాస్క్ లో తన బొమ్మ తీసుకున్నప్పుడు ఏడ్చానని చెప్పింది. సుదీప మాటలు విన్న కంటెస్టెంట్స్ కంటతడి పెట్టారు. సుదీపని ఓదార్చారు.

ఇక కీర్తి మాట్లాడుతూ.. గుడికి వెళ్లొస్తూ తన కుంటుంబం మొత్తం కారు యాక్సిడెంట్ లో మరణించారని, తన ఫ్యామిలిలో తను ఒక్కదే మిగిలిందని, ఎందుకు మిగిలానా అని చాలా బాధపడ్డానని, తన బంధువులు ఆస్తిని లాక్కొని తనని రోడ్డు మీద వదిలేశారంటూ బాధపడింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా బయటకు వచ్చి ఇప్పుడు ఈ స్టేజికి వచ్చానని, జీవితంలో అందర్నీ పోగొట్టుకున్న తను ఒక పాపని దత్తత తీసుకున్నానని, తన వల్లే కాస్త సంతోషంగా ఉన్నాను అనుకునేలోపే ఆరోగ్యం బాగోలేక తను కూడా మరణించిందని చెప్పి ఏడ్చేసింది. ఇక యాక్సిడెంట్ తర్వాత తన గర్భసంచి తీసేశారని, జీవితంలో పిల్లలు కనలేనని ఏడుస్తూ ఎమోషనల్ అయింది. కీర్తి లైఫ్ స్టోరీ విని అంతా ఏడ్చారు.

BiggBoss 6 : ఇదేం టాస్క్ రా బాబు.. పిల్లల బొమ్మల్నిచ్చి పిల్లల్ని పెంచమన్న బిగ్‌బాస్

సింగర్ రేవంత్ మాట్లాడుతూ.. నేను జీవితంలో నాన్న ప్రేమను పొందలేదని, నాన్న అని పిలవలేదని చెప్పాడు. త్వరలో తానూ తండ్రి కాబోతున్నాను అని, హౌస్ నుంచి బయటకి వెళ్ళేలోపు తనని నాన్న అని పిలిచే బిడ్డ రెడీగా ఉంటారని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

ఇక హౌస్ లో కపుల్ గా ఎంట్రీ ఇచ్చిన మెరీనా జంట కూడా తమ ఎమోషనల్ స్టోరీ చెప్పారు. మెరీనా మాట్లాడుతూ.. తనకు తండ్రి ప్రేమ అంటే తెలియదని, అసలు ఆయన ఎవరో కూడా తెలీదని, ఒకరోజు సడెన్ గా ఒకతను వచ్చి మీ నాన్నని అన్నారు. అతను మా అమ్మని కొట్టడం చూసి తండ్రి అంటేనే అసహ్యం వేసింది. నన్ను ఎవరైనా మా నాన్న ఏది అని అడిగితే చనిపోయాడు అని చెప్తానని, ఇప్పుడు తండ్రి ప్రేమని కూడా నా భర్త దగ్గర్నుంచి అందుకుంటున్నాను అని తెలిపింది.

ఇక చంటి మాట్లాడుతూ.. తన తల్లి కళ్ళ ముందే ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయింది, అలా ఏడుస్తూనే కుర్చున్నాని చెప్పాడు. దేవుడు తన తల్లిని కూతుళ్ళ రూపంలో ఇద్దరిగా పంపాడని తెలిపి ఎమోషనల్ అయ్యాడు. ఇక శ్రీ సత్య తల్లి తండ్రి ఏదన్నా చెప్తే చాలా మంది చిరాకు పడతారని, కానీ వాళ్ళు ఏమి చెప్పకపోతే కూడా అలాగే అనిపిస్తుందని ఎమోషనల్ అయింది. ఇలా హౌస్ లోని కొంతమంది కంటెస్టెంట్స్ తమ లైఫ్ లో జరిగిన బాధాకరమైన సంఘటనలని పంచుకున్నారు. మరో కెప్టెన్సీ టాస్క్ కింద ఓ మ్యూజిక్ గేమ్ ఆడించగా నేడు ఎవరు కెప్టెన్ అవుతారో తెలిసే అవకాశం ఉంది.