BiggBoss 6 : ఇదేం టాస్క్ రా బాబు.. పిల్లల బొమ్మల్నిచ్చి పిల్లల్ని పెంచమన్న బిగ్‌బాస్

 బిగ్‌బాస్ ఆరో సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. మొదటి వారం పూర్తయి, రెండో వారం నామినేషన్స్ కూడా అయ్యాయి. ఈ నామినేషన్స్ లో గొడవలు కూడా బాగానే జరిగాయి. ఇక మంగళవారం ఎపిసోడ్ లో బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్.............

BiggBoss 6 : ఇదేం టాస్క్ రా బాబు.. పిల్లల బొమ్మల్నిచ్చి పిల్లల్ని పెంచమన్న బిగ్‌బాస్

BiggBoss 6 Day 9 contestants performances

BiggBoss 6 :  బిగ్‌బాస్ ఆరో సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. మొదటి వారం పూర్తయి, రెండో వారం నామినేషన్స్ కూడా అయ్యాయి. ఈ నామినేషన్స్ లో గొడవలు కూడా బాగానే జరిగాయి. ఇక మంగళవారం ఎపిసోడ్ లో బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా ‘సిసింద్రీ’ టాస్క్ ఇచ్చారు. గతవారం కొంతమంది కెప్టెన్సీ పోటీకి డైరెక్ట్ వెళ్ళిపోయినా ఈ సారి మాత్రం కెప్టెన్సీ టాస్క్ ని అందరూ ఆడాల్సిందే.

ఈ టాస్క్ లో హౌజ్‌లోని ప్రతి సభ్యుడికి ఓ బేబీ బొమ్మని ఇచ్చారు. బిగ్‌బాస్ చెప్పేదాకా ఆ బొమ్మని సొంత బేబీలా చూసుకోవాలని చెప్పాడు. ఇందులో భాగంగా ఆ బొమ్మకి పాలు పట్టాలి, డైపర్లు మార్చాలి, తినిపించాలి.. ఇలా చాలా చేయాలి. అయితే అవేమి డైరెక్ట్ గా చేయము కానీ అవన్నీ చేసినట్టు నటించాలి. దీంతో ఇంటి సభ్యులంతా ఆ బొమ్మలని తీసుకొని ఆడించడం మొదలుపెట్టారు.

ఇలా ఆడేటప్పుడు ఆ బొమ్మలు ఏడ్చేలా, నవ్వేలా సెట్ చేశాడు బిగ్‌బాస్. ఇక ఈ టాస్క్ లో గీతూని బాగా ఆడుకున్నాడు బిగ్‌బాస్. ఎప్పటిలాగే గీతూ హడావిడి చేస్తూ నాకు పిల్లల్ని చూడటం రాదు. నేను పిల్లల్ని కొడతాను అనడంతో బిగ్‌బాస్ గీతూకి ఇచ్చిన బొమ్మని పదేపదే ఏడ్పించాడు. గీతూ అవస్థ చూడలేక హౌస్ లో అందరూ నవ్వేశారు. ఈ టాస్క్ లో బజర్‌ మోగినప్పుడు గార్డెన్‌ ఏరియాలో ఉన్న ఐదు బేబీ చైర్‌లో బేబీని పెట్టిన వారు నెక్ట్స్ కెప్టెన్సీ టాస్క్ కి ఎంపికవుతారు అని చెప్పాడు.

BiggBoss 6 : రెండో వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా..? హౌస్ లో అర్ధరాత్రి దొంగతనాలు..

ఈ టాస్క్ లో రేవంత్‌ దగ్గర ఉన్న బేబీని వేరే వాళ్ళు తీసుకోవడంతో అతను పోటీ నుంచి తప్పుకుంటాడు. ఆ తర్వాత తన భార్య కూడా ప్రెగ్నెంట్ అని ఎప్పటిలాగే ఎమోషనల్ అయ్యాడు రేవంత్. మెరీనా తనకిచ్చిన బేబీ బొమ్మని బాగా చూసుకుందని బిగ్‌బాస్ ప్రశంసించాడు. ఆ తర్వాత మరో గేమ్ గోనె సంచులు తొడుక్కుని బాక్సెస్‌ ఫిల్‌ చేసే టాస్క్ ఇచ్చారు. మంగళవారం ఎపిసోడ్ సరదాగా బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులు చేయడంతోనే సరిపోయింది. ఈ మధ్యలో మళ్ళీ రేవంత్ కి వేరే కంటెస్టెంట్స్ కి గొడవలయ్యాయి.