Kalki 2898 AD : ‘కల్కి’ని వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తున్నా.. కానీ అవుట్ చూసి.. నిర్మాత అశ్వినీ దత్!

ప్రభాస్ కల్కి గ్రాఫిక్స్ గురించి నిర్మాత అశ్వినీ దత్ శోకేకింగ్ కామెంట్స్ చేశాడు. 100 కోట్లు ఖర్చుబెడుతున్న నేనే విజువల్స్ చూసి..

Kalki 2898 AD : ‘కల్కి’ని వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తున్నా.. కానీ అవుట్ చూసి.. నిర్మాత అశ్వినీ దత్!

aswini dutt comments on Prabhas Kalki 2898 AD graphics

Updated On : August 30, 2023 / 3:43 PM IST

Kalki 2898 AD : ప్రభాస్ (Prabhas) హీరోగా, కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ గా తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ ‘కల్కి’. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనే(Deepika Padukone), అమితాబ్(Amitabh Bachchan), దిశా పటాని(Disha Patani) వంటి బడా స్టార్స్ నటిస్తున్నారు. అలాగే మరికొంతమంది స్టార్స్ కూడా ఈ మూవీలో కనిపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో సి అశ్వినీ దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Kollywood : వారసులు అంతా కలిసి సినిమా చేయబోతున్నారా..? కోలీవుడ్‌లో హాట్ టాపిక్..!

తాజాగా ఈ నిర్మాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నగా కల్కికి సంబంధించిన పలు విషయాలను అభిమానులకి తెలియజేశాడు. ఈక్రమంలోనే విజువల్స్ గురించి కూడా మాట్లాడాడు. “ప్రపంచంలోని టాప్ గ్రాఫిక్ కంపెనీస్ ఈ సినిమా కోసం పని చేస్తున్నాయి. అందుకోసం నేనే 100 కోట్లు ఖర్చుబెడుతున్నాను. కాబట్టి అవుట్ ఫుట్ ఎలా ఉంటుంది అనేది నాకు అంచనా ఉంటుంది. అయితే మూవీ అవుట్ ఫుట్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆ ఆలోచనకు మించి విజువల్స్ ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు.

Bro Movie : ఇండియాలోనే కాదు పాకిస్తాన్, బంగాళాదేశ్‌లో కూడా పవన్ కళ్యాణ్ బ్రో సందడి..

కాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన సమయంలో ఆడియన్స్ నుంచి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ తరువాత గ్లింప్స్ చూసి అందరూ ఒకే అనుకున్నారు. అయితే ప్రభాస్ గత రెండు సినిమాలు గ్రాఫిక్స్ విషయంలో ఆడియన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకున్నాయి. దీంతో కల్కి టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకనే మొన్న అభిమానులు, కొంతమంది టెక్నీషియన్స్ నుంచి గ్రాఫిక్స్ అండ్ VFX వర్క్ పై ఫీడ్ బ్యాక్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ సేకరించాడు. ఇక ఇప్పుడు అశ్వినీ దత్ మాటలు కూడా వింటుంటే.. టీం అంతా అద్భుతమైన అవుట్ ఫుట్ ని తీసుకు వచ్చేలా వర్క్ చేస్తుందని తెలుస్తుంది.