Bigg Boss 7 : ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ కానుందా..?
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో ఏడో వారం చివరి దశకు వచ్చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై పడింది.

Bigg Boss Telugu 7 Seventh week elimination
Bigg Boss 7 Seventh week elimination : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో ఏడో వారం చివరి దశకు వచ్చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై పడింది. ఆరు వారాల్లో ఆరుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో నయని పావని లు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్లలో భోలే షావలి, టేస్టీ తేజ, అశ్విని శ్రీ, పూజా మూర్తి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ లు ఉన్నారు.
ఈ వారం అమ్మాయినే ఎలిమినేట్ చేస్తారా..? లేదంటే అబ్బాయిని ఎలిమినేట్ చేస్తారా..? అన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ఆరు వారాల్లో ఆరుగురు అమ్మాయిలు ఎలిమినేట్ చేయడంతో ఈ సారి ఖచ్చితంగా అబ్బాయే ఎలిమినేట్ కానున్నారని కొందరు అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్‌ను బట్టి చూస్తే ప్రశాంత్, అమర్ దీప్, బోలే షావళి లు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. డేంజర్ జోన్‌లో అశ్విని శ్రీ, పూజా మూర్తి ఉన్నారు. ఓటింగ్‌లో ఎటువంటి మార్పు లేకపోతే ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
శివాజీని ఇంటికి పంపిస్తారా..?
ఓ టాస్క్ సందర్భంగా శివాజీ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. గత మూడు వారాలు నొప్పిని భరిస్తూనే హౌస్‌లో ఉంటున్నారు శివాజీ. దీంతో టాస్క్‌లో అతడు ఆడలేకపోవడంతో సంచాలక్‌కే పరిమితం చేశారు బిగ్‌బాస్. ఆయన చేతి నొప్పి ఎక్కువ కావడంతో కన్ఫెషన్ రూంకి పిలిచి గాయం ఎలా ఉందని బిగ్‌బాస్ అడిగారు. చేయి మొత్తం లాగుతోందని, ఇబ్బంది ఉన్నట్లు శివాజీ చెప్పుకొచ్చారు.
Venu Yeldandi : తండ్రైన బలగం వేణు.. పాప పుట్టిందంటూ ఫొటో షేర్ చేసి..
ఎవరూ లేకపోతే ఏడుస్తున్నాను అని ఎవరైనా ఉంటే మాత్రం నవ్వుతూనే బాధను భరిస్తున్నట్లు తెలిపారు. శివాజీ గాయంతో బాధపడుతుండడంతో ఈ వారం ఆయన్ను ఇంటికి పంపిచేయాలని బిగ్‌బాస్ భావిస్తున్నట్లు లీక్ వీరులు చెబుతున్నారు. చూడాలి మరీ వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో.