BiggBoss 6 Day 2 : రెండో రోజే డైరెక్ట్‌గా ముగ్గురు నామిషన్స్‌లోకి.. హడావిడి చేసిన గీతూ.. ఓవర్ యాక్షన్ అంటున్న నెటిజన్లు..

టాస్క్ ముగిసే సమయానికి నేహా, ఆదిరెడ్డి, గీతూ క్లాస్‌ టీమ్‌లో మిగిలిన వారంతా వేరే టీమ్స్ లో ఉన్నారు. దీంతో క్లాస్ టీం వాళ్ళు నామినేషన్ నుంచి తప్పించుకున్నారు, అంతే కాక ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఉండబోతారు. ఇక ట్రాష్ టీంలో ఉన్న........

BiggBoss 6 Day 2 : రెండో రోజే డైరెక్ట్‌గా ముగ్గురు నామిషన్స్‌లోకి.. హడావిడి చేసిన గీతూ.. ఓవర్ యాక్షన్ అంటున్న నెటిజన్లు..

BiggBoss 6 Day 2 epiosde contestants performances

BiggBoss 6 Day 2 : బిగ్‌బాస్‌ సీజన్ 6లో మొదటి రోజు డ్యాన్సులు, గొడవలు, ఏడుపులతో సాగగా రెండో రోజు పర్లేదనిపించింది. మొదటిరోజు ఇంటిసభ్యులను క్లాస్‌, మాస్‌, ట్రాష్‌ అంటూ మూడు భాగాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. అయితే మధ్యమధ్యలో ఈ టీంలని చేంజ్ చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్‌. దీంతో అందరూ బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్కులని బాగానే ఆడి కొంతమంది టీంలు చేంజ్ అయ్యారు.

అలాగే ట్రాష్‌ నుంచి ఒకరు క్లాస్‌ సభ్యుడితో మాట్లాడుకొని టీం చేంజ్ అవ్వొచ్చని చెప్పడంతో గీతూ క్లాస్‌లోకి ఎంటరవగా బాలాదిత్య ట్రాష్‌లోకి వచ్చాడు. క్లాస్ టీంలో ఉన్న వాళ్ళు అన్ని సౌకర్యాలు అనుభవిస్తారని, ట్రాష్ లో ఉన్న వాళ్ళతో పనులు చేయించుకోవచ్చు కాసేపు అని చెప్పడంతో గీతూ తెగ హడావిడి చేసింది. చక్కగా సోఫా మీద కూర్చొని ట్రాష్ టీంలో ఉన్న వాళ్లకి ఆర్డర్స్ వేసింది. ఇనయా సుల్తానాని టార్గెట్ చేసి ఆమెకి పనులు చెప్తూ కౌంటర్లు వేసింది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య గొడవ అయింది.

టాస్క్ ముగిసే సమయానికి నేహా, ఆదిరెడ్డి, గీతూ క్లాస్‌ టీమ్‌లో మిగిలిన వారంతా వేరే టీమ్స్ లో ఉన్నారు. దీంతో క్లాస్ టీం వాళ్ళు నామినేషన్ నుంచి తప్పించుకున్నారు, అంతే కాక ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఉండబోతారు. ఇక ట్రాష్ టీంలో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయా సుల్తానా ఈ వారం డైరెక్ట్ గా నామినేషన్‌లోకి వచ్చారు. మరి ఈ వారం ఇంకా ఎవర్నైనా నామినేషన్ లోకి పంపుతారేమో చూడాలి.

BiggBoss6 : మొదటి రోజే గొడవలు మొదలు.. ఈ జుట్టు పంచాయితీ ఏందో.. రెచ్చిపోయిన గీతూ..

ఇక మరో టాస్క్ ఇవ్వడంతో ఈ టాస్క్ లో రేవంత్ ఓడిపోయాడు. దీంతో బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చాడు. ఇక భార్య భర్తలైన మెరీనా-రోహిత్ మధ్య కూడా గొడవలు వచ్చాయి. ఇనయా సుల్తానా నాకెవ్వరు సపోర్ట్ చేయట్లేదంటూ దూరంగా వెళ్లి పోయింది. ఇక గీతూ ఎప్పటిలాగే అందరిమీద కౌంటర్లు వేసింది. ఇక గీతూ ఉన్నంతసేపు చాలా హడావిడి చేయడంతో బాగా ఓవర్ యాక్షన్ చేస్తుందంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఇలాగే ఓవర్ యాక్షన్ చేస్తే తొందరగా వెళ్ళిపోతావు అంటున్నారు.