Bimbisara Collections: బింబిసార 6 రోజుల కలెక్షన్స్.. ఆ మార్క్‌కు చేరువలో!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ గత శుక్రవారం బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కట్టారు. బింబిసార చిత్రం రిలీజ్ అయిన 6 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.24.84 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టి తన సత్తా చాటింది.

Bimbisara Collections: బింబిసార 6 రోజుల కలెక్షన్స్.. ఆ మార్క్‌కు చేరువలో!

Bimbisara Collections: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ గత శుక్రవారం బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కట్టారు. దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫాంటెసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

Bimbisara Part 2 : బింబిసార 2 స్టోరీ చెప్పేసిన కళ్యాణ్ రామ్

ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దానికితోడు ఎంఎం.కీరవాణి బీజీఎం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన విధానం కూడా ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పాలి. ముఖ్యంగా బింబిసార మహారాజు ఎపిసోడ్స్ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. అటు మోడ్రన్ ప్రపంచంలో బింబిసారుడి ప్రయాణం కూడా అద్భుతంగా చూపించాడు. దీంతో ఈ రెండింటి మధ్య లింక్‌ను కూడా బాగా ఎలివేట్ చేసి చూపించడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.

Bimbisara: బింబిసార, సీతా రామం.. అన్నగారికే క్రెడిట్!

కాగా, బింబిసార చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడం విశేషం. ఈ సినిమా తన పవర్‌ను కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బింబిసార చిత్రం రిలీజ్ అయిన 6 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.24.84 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టి తన సత్తా చాటింది. ఇక వారం రోజుల థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ ఖచ్చితంగా రూ.25 కోట్ల మార్క్‌ను క్రాస్ చేస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఏరియాలవారీగా ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 7.80 కోట్లు
సీడెడ్ – 4.81 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.22 కోట్లు
ఈస్ట్ – 1.38 కోట్లు
వెస్ట్ – 1 కోట్లు
గుంటూరు – 1.63 కోట్లు
కృష్ణా – 1.18 కోట్లు
నెల్లూరు – 0.67 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.21.69 కోట్లు (రూ.34.05 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.40 కోట్లు
ఓవర్సీస్ – రూ.1.75 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.24.84 కోట్లు (రూ.41.10 కోట్లు గ్రాస్)