#BoycottHrithik : మళ్ళీ బాయ్‌కాట్‌ జొమాటో, బాయ్‌కాట్‌ హృతిక్.. పాపం బాలీవుడ్..

ఇటీవలే హృతిక్ ఈ బాయ్‌కాట్‌ నిరసనకు గురయ్యాడు. తాజాగా మళ్ళీ మరోసారి బాయ్‌కాట్‌ హృతిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సారి బాయ్‌కాట్‌ హృతిక్ తో పాటు బాయ్‌కాట్‌ జొమాటో కూడా ట్రెండ్ అవుతుంది. ఇందుకు కారణం హృతిక్ నటించిన జొమాటో యాడ్.........

#BoycottHrithik : మళ్ళీ బాయ్‌కాట్‌ జొమాటో, బాయ్‌కాట్‌ హృతిక్.. పాపం బాలీవుడ్..

boycott hrithikroshan

Updated On : August 22, 2022 / 9:29 AM IST

#BoycottHrithik :  అసలే వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ బాలీవుడ్ బాధల్లో ఉంటే రోజూ రోజుకి బాయ్‌కాట్‌ బాలీవుడ్ వివాదం ముదురుతోంది. బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్‌ చేస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. ఇటీవలే హృతిక్ ఈ బాయ్‌కాట్‌ నిరసనకు గురయ్యాడు. తాజాగా మళ్ళీ మరోసారి బాయ్‌కాట్‌ హృతిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సారి బాయ్‌కాట్‌ హృతిక్ తో పాటు బాయ్‌కాట్‌ జొమాటో కూడా ట్రెండ్ అవుతుంది. ఇందుకు కారణం హృతిక్ నటించిన జొమాటో యాడ్.

ప్రముఖ ఫుడ్‌ డెలీవరి యాప్ జొమాటో ఇటీవల హృతిక్ రోషన్ తో ఓ యాడ్ చేసింది. ఈ యాడ్‌లో హృతిక్‌ కమాండోగా నటించాడు. ఆకలి వేసి ఫుడ్‌ ఆర్డర్ చేస్తే మిగతా కమాండోలు ‘ఈ ఆర్డర్ ఎవరిచ్చారు?’ అని అడుగుతారు జొమాటో బాయ్ ని. దీనికి హృతిక్.. నేనే.. నాకు ఆకలిగా ఉంది. మనం ఉజ్జయినిలో ఉన్నాం. అందేకే మహాకాల్‌ నుంచి తాలీ ఆర్డర్‌ చేశాను అని చెప్తాడు. అయితే ఈ మాటలే ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. ఈ డైలాగ్స్ పై ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయానికి చెందిన పూజారులు, హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Brahmaji : అసలు సమంత గురించి మాట్లాడటానికి నువ్వెవరు.. సీరియస్ అయిన బ్రహ్మాజీ..

మహాకాల్‌ అనేది శివునికి మరో పేరు. పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరం ఆలయం ఒకటి. అక్కడ తాలీ అని ప్రసాదంగా ఇస్తుంటారు. అయితే మహాకాళేశ్వరం ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఒక రెస్టారెంట్ లో దొరికే ఫుడ్ గా, మహాకాళేశ్వరం ఆలయాన్ని రెస్టారెంట్‌గా చెప్పినట్లు ఆ యాడ్ ని షూట్ చేశారని, ప్రసాదాన్ని రెస్టారెంట్ ఫుడ్ లా ప్రమోట్ చేస్తారా అంటూ ఆ ఆలయం పూజారులతో పాటు హిందువులు జొమాటోపై, ఈ యాడ్ ఒప్పుకున్నందుకు హృతిక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెటిజన్లు మరోసారి హృతిక్‌ రోషన్‌, జొమాటో క్షమాపణలు చెప్పాలి అంటూ బాయ్‌కాట్‌ జొమాటో, బాయ్‌కాట్‌ హృతిక్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ఈ వివాదం పెద్దది అవుతుందని గుర్తించిన జొమాటో ఆ యాడ్ లో సంభషణలని తీసేసి వేరే డైలాగ్స్ ని పెట్టింది. గతంలో కూడా జొమాటో ఇలాగే హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు బాయ్‌కాట్ నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తుందని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఇక హృతిక్ రోషన్ పరిస్థితి మరీ దారుణం అయింది. ఇటీవలే అమీర్ ఖాన్ కి సపోర్ట్ ఇచ్చాడని బాయ్‌కాట్ చేశారు, అది అవ్వకముందే ఇలా జొమాటో వల్ల బాయ్‌కాట్ అవుతున్నాడు. రోజు రోజుకి బాలీవుడ్ పరిస్థితి చూస్తుంటే పాపం అనిపిస్తుంది. బాయ్‌కాట్ బాలీవుడ్ అని బాలీవుడ్ ప్రేక్షకులే చేయడం ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విశేషం.