Changure Bangaru Raja : రవితేజ నిర్మిస్తున్న ‘ఛాంగురే బంగారు రాజా’ ట్రైలర్ రిలీజ్..

రవితేజ నిర్మిస్తున్న 'ఛాంగురే బంగారు రాజా' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కార్తీక్ రత్నం, రవిబాబు, సత్య ప్రేమ కథలతో పాటు సునీల్..

Changure Bangaru Raja : రవితేజ నిర్మిస్తున్న ‘ఛాంగురే బంగారు రాజా’ ట్రైలర్ రిలీజ్..

Changure Bangaru Raja trailer released by Raviteja

Updated On : September 10, 2023 / 9:15 PM IST

Changure Bangaru Raja : మాస్ మహారాజ రవితేజ (Raviteja) హీరోగా ఒక పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క నిర్మాతగా కూడా వరుస చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నాడు. RT టీమ్ వర్క్స్ (RT Team Works) అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే ఇప్పటికే పలువురు కొత్తదర్శకులకు అవకాశాలు ఇచ్చి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Jailer : చిత్ర యూనిట్‌కి బంగారు కానుకలు అందజేసిన జైలర్ నిర్మాతలు..

తాజాగా ‘ఛాంగురే బంగారు రాజా’ అనే క్రైమ్ కామెడీ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. సతీష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కేరాఫ్ కంచరపాలెం నటుడు కార్తీక్ రత్నం, రవిబాబు, సత్య, ఎస్తర్ నోరాన్హా, గోల్డీ నిస్సీ, నిత్యశ్రీ.. పలువురు ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి రవితేజ కూడా హాజరయ్యాడు. అలాగే ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు. ట్రైలర్ మొత్తం ఫుల్ ఆన్ ఎంటర్‌టైనింగ్ గా సాగింది.

Mega157 : చిరంజీవి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఇక అడ్వెంచర్ షురూ..

వర్షం పడినప్పుడు రత్నాలు దొరకడం, వాటి వల్ల హీరో ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు అనేది సినిమా కథ. ఇక ఈ కథ మధ్యలోనే కార్తీక్ రత్నం, రవిబాబు, సత్య లవ్ ట్రాక్స్ ఆడియన్స్ ని అలరించేలా ఉన్నాయి. అలాగే ఈ మూవీలో మరో ఎంటర్‌టైనింగ్ అంశం కూడా ఉంది. ఈ సినిమాలో ఒక కుక్క పాత్ర కూడా ఉంది. ఆ పాత్రకు సునీల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. సినిమా కథ మొత్తం ఈ కుక్కే చెబుతూ ఉంటుంది. మరి ఆ ట్రైలర్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.