Miss Shetty Mr Polishetty : చిరు రివ్యూస్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తొలి ప్రేక్షకుడ్ని నేనే..
ఇన్నాళ్లు చిరు లీక్స్ ఇచ్చిన బాస్.. ఇప్పుడు చిరు రివ్యూస్ మొదలు పెట్టాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తొలి ప్రేక్షకుడ్ని నేనే అంటూ..

Chiranjeevi review on Miss Shetty Mr Polishetty movie
Miss Shetty Mr Polishetty : అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేశాడు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రస్తుత జనరేషన్ కథతో ఈ మూవీని మహేష్ తెరకెక్కించాడు.
Balakrishna : జైలర్ సీక్వెల్.. ఈ సారి మాత్రం బాలయ్య పక్కా ఉండాల్సిందే..
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ మొత్తని తన భుజాలు మీద వేసుకున్న నవీన్ పోలిశెట్టి.. కొన్ని రోజులు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ రిలీజ్ కి ముందే మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) చిత్ర యూనిట్ స్పెషల్ షో వేసి చూపించింది. ఇక ఈ సినిమా చూసిన చిరు.. మూవీ పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో మూవీ రివ్యూ ఇచ్చేశాడు.
Vijay Devarakonda : అప్పుడు సమంతకి ముద్దు పెట్టలేదు అని చెప్పిన విజయ్.. ఇప్పుడు ఖుషి సినిమాలో..
సినిమా మొదటి నుంచి చివరి దాకా హిలేరియస్ ఎంటర్‌టైన్మెంట్ పంచిందని, జాతి రత్నాలుకి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని నవీన్ అందజేశాడని చెప్పుకొచ్చాడు. అనూష్క శెట్టి కూడా తన యాక్టింగ్ తో ఆకట్టుకుందని వెల్లడించాడు. నేటి యువత ఆలోచనా విధానాన్ని కామెడీ అండ్ ఎమోషనల్ గా డైరెక్టర్ మహేష్ బాబు చూపించాడని పేర్కొన్నాడు. ఈ మూవీ చూసిన మొదటి ప్రేక్షకుడ్ని నేనే అంటూ.. సినిమా 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. చిరు లీక్స్ టు చిరు రివ్యూస్ కి షిఫ్ట్ అయ్యారా బాస్..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చిరంజీవి రివ్యూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీంకి ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.
‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్… pic.twitter.com/ADJVt6ins6
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 5, 2023