LinguSamy : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి జైలుశిక్ష.. మొన్నే రామ్‌తో ‘ది వారియర్’.. అంతలోనే ఇలా..

 కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి ఇటీవలే రామ్‌తో 'ది వారియర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఈ సినిమా పరాజయం అయిందనే బాధలో ఉండగానే లింగుసామికి మరో షాక్ తగిలింది. ఈ డైరెక్టర్ కు చెన్నైలోని సయిదాపేట కోర్టు ఆరునెలల జైలు శిక్ష.............

LinguSamy :  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి జైలుశిక్ష.. మొన్నే రామ్‌తో ‘ది వారియర్’.. అంతలోనే ఇలా..

lingusaamy

LinguSamy :  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి ఇటీవలే రామ్‌తో ‘ది వారియర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఈ సినిమా పరాజయం అయిందనే బాధలో ఉండగానే లింగుసామికి మరో షాక్ తగిలింది. ఈ డైరెక్టర్ కు చెన్నైలోని సయిదాపేట కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది.

పీవీపీ క్యాపిటల్ ప్రొడక్షన్ కంపెనీలో లింగుస్వామి, అతడి సోదరుడు సుభాష్ చంద్ర ఒక సినిమా చేస్తామని రూ.1.03 కోట్లు తీసుకున్నారు. కార్తీ, సమంత జంటగా ఓ సినిమాని మొదలుపెట్టాడు లింగుసామి. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఈ సినిమాకోసం తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా పీవీపీ క్యాపిటల్ ప్రొడక్షన్ కంపనీ లింగుస్వామిని అడిగింది. ఎన్ని సార్లు అడిగినా లింగుసామి నుంచి సమాధానం రాకపోవడంతో ఆ నిర్మాతలు లింగుసామి, అతని సోదరుడిపై కేసు వేశారు.

Chitrapuri Colony Hospital : సినీ కార్మికుల కోసం చిరంజీవి హాస్పిటల్.. ప్రెస్ మీట్ పెట్టి విమర్శించిన దివంగత ప్రముఖ నటుడి కూతుర్లు

ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వట్లేదని, ఆయన ఇచ్చిన చెక్స్ కూడా అన్నీ బౌన్స్ అయ్యాయని నిర్మాతలు కోర్టులో తెలిపారు. ఈ కేసును విచారించిన కోర్టు లింగుసామికి అతని సోదరుడుకు ఆరు నెలలు జైలు శిక్ష విధించినది. ఈ తీర్పుతో షాక్ తిన్న లింగుసామి హైకోర్టుకు అప్పీల్ చేశారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కి జైలు శిక్ష విధించారని తెలిసి ఈ వార్త తమిళ, తెలుగు పరిశ్రమలలో చర్చగా మారింది.