Ahimsa Teaser : అహింస టీజర్ రిలీజ్.. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి హీరో ఎంట్రీ.. తేజ మార్క్ కథేనా??

గతంలో వదిలిన అహింస గ్లింప్స్ రా, రస్టిక్ గా ఉండి సినిమాపై అంచనాలు నెలకొల్పింది. కానీ టీజర్ చూసిన తర్వాత తేజ గత సినిమాలు జయం, నిజం, నీకు నాకు లాంటి పలు సినిమాల ఫ్లేవర్..........

Ahimsa Teaser : అహింస టీజర్ రిలీజ్.. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి హీరో ఎంట్రీ.. తేజ మార్క్ కథేనా??

Daggubati Abhiram Ahimsa Teaser Released

Ahimsa Teaser :  తెలుగు సినీ పరిశ్రమకి ఎంతోమంది హీరో, హీరోయిన్స్ ని పరిచయం చేసిన దర్శకుడు తేజ. ఇప్పుడు దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేయబోతున్నాడు. తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమాతో అభిరామ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరకెక్కుతున్న అహింస సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

గతంలో వదిలిన అహింస గ్లింప్స్ రా, రస్టిక్ గా ఉండి సినిమాపై అంచనాలు నెలకొల్పింది. కానీ టీజర్ చూసిన తర్వాత తేజ గత సినిమాలు జయం, నిజం, నీకు నాకు లాంటి పలు సినిమాల ఫ్లేవర్ కనిపిస్తుంది. అదే ప్రేమ కథ , విలన్, కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, హీరో, హీరోయిన్స్ మధ్య సన్నివేశాలు మామూలువే ఉన్నాయి అనిపిస్తుంది. తేజ సినిమాల్లో ఉండే కథల్లాగానే ఉండబోతుంది అని తెలుస్తుంది. మరి సినిమాలో కొత్తగా ఏమన్నా చూపిస్తాడేమో చూడాలి. ఇందులో సదా కూడా ఉండటం విశేషం.

RRR: ఆస్కార్ బరిలో “RRR”.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్!

కాకపోతే తేజ సినిమాలు ఎలా ఉన్నా మంచి పేరు తెచ్చుకుంటాయి. ఎప్పట్లాగే ఈ సినిమా కూడా అందరూ కొత్తవాళ్ళతోనే తెరకెక్కించాడు తేజ. మరి దగ్గుబాటి వారసుడు అభిరామ్ కి ఈ సినిమా టాలీవుడ్ ఎంట్రీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. దగ్గుబాటి బ్యాక్ గ్రౌండ్ ఉంచుకొని ఎలాంటి ప్రమోషన్ లేకుండా టీజర్ ని సైలెంట్ గా రిలీజ్ చేయడం విశేషం.