Vishwak Sen : విశ్వక్ అసలు హీరోనే కాదు.. చెప్పుతో కొట్టాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ''అసలు విశ్వక్ సేన్ ని మేం అయితే హీరోగా గుర్తించడం లేదు, లైవ్ లో ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీడియాలో......

Vishwak Sen : విశ్వక్ అసలు హీరోనే కాదు.. చెప్పుతో కొట్టాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Vishwak (1)

 

Vishwak Sen :  గత మూడు రోజులుగా విశ్వక్‌సేన్‌ వార్తల్లో నిలుస్తున్నాడు. త్వరలో రిలీజ్ కానున్న తన సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ని ప్రమోట్ చేస్తూ ఇటీవల రోడ్ మీద ఓ ప్రాంక్ వీడియో చేశాడు. ఈ వీడియోని నడిరోడ్డు మీద చేసి జనాల్ని ఇబ్బంది పెట్టడంతో నెటిజన్స్, పబ్లిక్ విశ్వక్ ని ట్రోల్ చేశారు. విశ్వక్‌సేన్‌ పై ఈ విషయంలో హెచ్చార్సీకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇదే విషయంపై చర్చించడానికి ఓ న్యూస్ ఛానల్ విశ్వక్‌సేన్‌ ని ఛానల్ కి పిలవగా ఆ డిబేట్ గొడవగా మారి యాంకర్, హీరో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఇలా మాట్లాడుతూ హీరో ఓ అసభ్యకరమైన పదంతో యాంకర్ ని దూషించాడు. దీంతో ఈ ఇష్యూ మరింత పెద్దదిగా మారింది.

 

ఈ ఇష్యూపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ”అసలు విశ్వక్ సేన్ ని మేం అయితే హీరోగా గుర్తించడం లేదు, లైవ్ లో ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు వెళ్లాలి లేదా సైలెంట్ గా ఉండాలి. స్టూడియోలో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. లేకపోతే మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తాము. ఆ మహిళా యాంకర్ అతను తప్పుగా మాట్లాడినప్పుడే విశ్వక్ సేన్ ని చెప్పుతో కొట్టాల్సింది.”

Tanushree Dutta : యాక్సిడెంట్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరోయిన్.. అయినా అలాగే దర్శనానికి..

”విశ్వక్ సేన్ బయట కనపడితే మా మహిళలు చెప్పులు తీసుకుని కొడతారు. విశ్వక్ సేన్ లాంటి దుర్మార్గుడిని సినిమాల్లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలను కోరుతున్నాను. విశ్వక్ సేన్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీ అమ్మ, చెల్లి, నీ పక్కనే ఉంటే కూడా అలాగే మాట్లాడతావా” అని ప్రశ్నించారు. మరి దీనిపై విశ్వక్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మరో వైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విష్వక్సేన్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.