Ginna Trailer: ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన జిన్నా

యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జిన్నా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను తొలుత దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

Ginna Trailer: ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన జిన్నా

Date Locked For Manchu Vishnu Ginna Trailer

Ginna Trailer: యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జిన్నా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను తొలుత దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

Manchu Vishnu : ప్రెసిడెంట్ సర్ వెరీ నాటీ అంటున్న సన్నీలియోన్.. స్టేజిమీదే ముద్దు పెట్టనా అని అడిగిన మంచు విష్ణు…

ఈ సినిమాలో మంచు విష్ణు మరోసారి పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌లు నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Manchu Vishnu Ginna Teaser: జిన్నా టీజర్.. మంచు విష్ణు డోస్ పెంచాడుగా!

ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు జి.నాగేశ్వర్ రెడ్డి, కోన వెంకట్‌లు స్క్రిప్టును అందించగా.. నందు, భానులు ఈ సినిమా డైలాగులను రాశారు. మంచు విష్ణు AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ఉమేశ్ కౌశిక్, రఘుబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ట్రైలర్‌తో జిన్నా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.