Deepika Padukone : లేడీ సింగంగా మారుతున్న పద్మావతి..

బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణె కాప్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలు డైరెక్టర్ లు ఒక సినిమాను మరో సినిమాతో కనెక్ట్ చేస్తూ ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే...

Deepika Padukone : లేడీ సింగంగా మారుతున్న పద్మావతి..

Deepika Padukone enters into rohit shetty cop universe

Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణె కాప్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలు డైరెక్టర్ లు ఒక సినిమాను మరో సినిమాతో కనెక్ట్ చేస్తూ ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అజయ్ దేవగన్ ‘సింగం’తో హిట్టు కొట్టడంతో.. సింగం రిటర్న్స్, శింబ, సూర్యవంశీ సినిమాలతో ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశాడు.

Deepika Padukone : FIFA వరల్డ్ కప్‌లో అరుదైన గౌరవం దక్కించుకున్న దీపికా పడుకోణె..

అజయ్ దేవగన్ తో మొదలైన ఈ ఫ్రాంచైజ్ లోకి రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు ఈ యూనివర్స్ లోకి లేడీ సింగంగా దీపికా పడుకోణె ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు దర్శకుడు రోహిత్. తాజాగా ఈ డైరెక్టర్, రణ్‌వీర్ తో తెరకెక్కించిన ‘సర్కస్’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో దీపికా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. నేడు ఆ సాంగ్ ని లాంచ్ చేసే వేడుకలో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కథా చర్చలు జరుగుతున్నాయి, వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలియజేశాడు. గతంలో రోహిత్ దర్శకత్వంలో దీపికా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సూపర్ హిట్టుగా నిలిచింది. మరి ఈ లేడీ సింగంతో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి. కాగా దీపికా ప్రస్తుతం షారుక్ ‘పఠాన్’లో నటించగా అది కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తెలుగులో ప్రభాస్ సరసన ప్రాజెక్ట్-K లో నటిస్తుంది.