Deepika Padukone : FIFA వరల్డ్ కప్‌లో అరుదైన గౌరవం దక్కించుకున్న దీపికా పడుకోణె..

బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణెకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో అత్యంత పాపులారిటీ ఉన్న స్పోర్ట్ ఏదైనా ఉందంటే అంది "సాకర్" అనే చెప్పాలి. ఇక ఫిఫా వరల్డ్‌కప్ కోసం అయితే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కాగా 18వ జరిగే ఫైనల్ మ్యాచ్ లో...

Deepika Padukone : FIFA వరల్డ్ కప్‌లో అరుదైన గౌరవం దక్కించుకున్న దీపికా పడుకోణె..

Deepika Padukone got a rare honor at the FIFA World Cup

Updated On : December 6, 2022 / 3:26 PM IST

Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణెకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో అత్యంత పాపులారిటీ ఉన్న స్పోర్ట్ ఏదైనా ఉందంటే అంది “సాకర్” అనే చెప్పాలి. పాపులారిటీ మాత్రమే కాదు అత్యంత కాస్ట్‌లీ గేమ్ కూడా ఇదే. ఇక ఫిఫా వరల్డ్‌కప్ కోసం అయితే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాంటి ఒక మెగా టోర్నీకి.. ఖతార్ లాంటి ఓ చిన్న దేశం 2022 గాను హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

Deepika Padukone: బ్రహ్మాస్త్ర పార్ట్-2లో హీరో తల్లిగా దీపికా.. ఆడియెన్స్ ఒప్పుకుంటారా?

నవంబర్ 20న మొదయులైన ఈ టోర్నీ డిసెంబర్ 18 వరకు జరగనుంది. కాగా ఇంతటి ప్రతిష్టాత్మక ఈవెంట్ లో దీపికా పడుకోణె కూడా చోటు దక్కించుకుంది అని తెలుస్తుంది. 18వ జరిగే ఫైనల్ మ్యాచ్ లో దీపికా ఫిఫా వరల్డ్ కప్ ని ఆవిష్కరించనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఈ ముద్దుగుమ్మ ఖతార్ బయలుదేరనుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రీడా ఈవెంట్‌లో ఇలాంటి గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ నటి దీపికా పడుకోణె.

కాగా ప్రస్తుతం దీపికా, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. షూటింగ్ పూర్తీ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే జవాన్, సర్కస్ చిత్రాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తున్న ఈ భామ తెలుగులో ప్రభాస్ కి జంటగా ప్రాజెక్ట్-K చిత్రంలో నటిస్తుంది.