Deepika Padukone: చనిపోవాలనుకున్నా.. అంతలా నరకం అనుభవించా!

పెళ్ళైన తర్వాత కూడా బాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ నటులుగా కొనసాగుతున్న కొద్ది మందిలో దీపికా పదుకొనే ముందు వరసలో ఉంటుంది. ఇటు దక్షణాది సినిమాలతో పాటు..

Deepika Padukone: చనిపోవాలనుకున్నా.. అంతలా నరకం అనుభవించా!

Deepika Padukone

Deepika Padukone: పెళ్ళైన తర్వాత కూడా బాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ నటులుగా కొనసాగుతున్న కొద్ది మందిలో దీపికా పదుకొనే ముందు వరసలో ఉంటుంది. ఇటు దక్షణాది సినిమాలతో పాటు అటు బాలీవుడ్ భారీ ప్రాజెక్టులను కూడా తన చుట్టూ తిప్పుకుంటున్న దీపికా ఒకప్పుడు బ్రతకడం ఎందుకు చనిపోతే బావుండు అని భావించింది. మానసికంగా నరకయాతన అనుభవిస్తున్న దీపికా అసలు ఏం చేస్తుందో ఎలా బ్రతుకుతుందో అర్ధంకాక గంటల తరబడి ఏడుస్తూ అలానే ఉండిపోయేదట. గతంలో కూడా ఒకసారి ఈ విషయంపై మాట్లాడిన దీపికా ఈసారి మరింత లోతుగా దాన్ని వివరించింది.

Big Boss 5: సరయు తొలివారమే ఎలిమినేషన్.. అభిమానులు కోరుకున్నదేనా?

తాజాగా జరిగిన ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ టీవీ షోలో దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌తో కలిసి పాల్గొన్నారామె. ఈ కార్యక్రమంలో హోస్ట్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ గతంలో దీపిక మానసిక పరిస్థితి గురించి గుర్తు చేయడంతో దీపికా మరోసారి గతాన్ని వివరించింది. 2014లో నేను డిప్రెషన్‌లో ఉన్న సమయం.. అప్పుడంతా నాలో ఏదో వెలితిగా.. ఏ పనీ చేయాలనిపించేది కాదు. ఎవరితోనైనా మాట్లాడాలని గానీ.. బయటికి వెళ్లాలని గానీ అనిపించేంది కాదు. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండేదాన్ని. చాలా సందర్భాల్లో ఎందుకు బతకడం.. చనిపోతే బావుండు అనిపించేది అని చెప్పింది.

Drugs Case: నేడు ఈడీ విచారణకు నటుడు నవదీప్, ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌!

ఓసారి దీపికా అమ్మానాన్న బెంగళూరు నుంచి ముంబయికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో దీపికా వాళ్ళ పేరెంట్స్ ను పట్టుకొని సడెన్‌గా ఏడ్చేసిందట. దీంతో దీపికా తల్లి ఆ కన్నీళ్లు ఏదో సాయం కోసం వచ్చినట్లుగా గుర్తించి దీపికా మానసిక పరిస్థితి బాగాలేదని కనుగొని వెంటనే సైకియార్టిస్ట్‌ దగ్గరికి వెళ్లమని సలహా ఇచ్చిందట. దీపికా అలా వైద్యుల చికిత్స తీసుకుని కొన్ని నెలల తర్వాత దాన్నుంచి బయటపడిందట. డిప్రెషన్‌ నుంచి కోలుకున్నా.. ఆ వ్యథని జీవితాంతం మర్చిపోలేమని చెప్పిన దీపికా ఎవరికి వారు మానసిక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే.. జీవనశైలి మారుతుందని చెప్పుకొచ్చింది.