The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ ఈవెంట్ కి ఫ్యాన్స్ కి అనుమతి లేదట..

ది రాజాసాబ్(The Rajasaab) మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 27 సాయంత్రం హైదరాబాద్ లో జరుగనున్న ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రేక్షకులకు, అభిమానులకు అనుమతి లేదంటూ ప్రకటించారు.

The Rajasaab:  ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ ఈవెంట్ కి ఫ్యాన్స్ కి అనుమతి లేదట..

Fans are not allowed at Prabhas's Raja Saab movie pre-release event.

Updated On : December 27, 2025 / 10:22 AM IST

The Rajasaab: ది రాజాసాబ్ మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు(డిసెంబర్ 27) సాయంత్రం హైదరాబాద్ లో జరుగనున్న ది రాజాసాబ్(The Rajasaab) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రేక్షకులకు, అభిమానులకు అనుమతి లేదంటూ ప్రకటించారు. కేవలం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని కోరారు మేకర్స్. వేదిక పరిమితులు అలాగే భారీగా జన సమూహం వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఈవెంట్ కి ప్రేక్షకులకు అనుమతులు ఇవ్వలేదట. కాబట్టి, ప్రభాస్ ఫ్యాన్స్ ది రాజాసాబ్ ఈవెంట్ ను ఇంట్లోనే ప్రత్యేక్ష ప్రసారం ద్వారా చూడాల్సిందింగా కోరారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

Nidhi Agarwal: ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదట.. నిధి పాప ఏంటి అలా అనేసింది.. ఫ్యాన్స్ ఏమంటారో..