AP Government : ఏపీలోని రైతులకు శుభవార్త.. కూటమి ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఉచిత పంపిణీ
AP Government : ఏపీలోని రైతులకు శుభవార్త. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఉచితంగా అందించేందుకు సీఎం చంద్రబాబు ..
AP government
AP Government: ఏపీలోని రైతులకు శుభవార్త. కూటమి ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు (pattadar passbooks) ఇచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామసభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూశాఖ చర్యలు చేపట్టింది.
Also Read : AP New Districts Row: ఏపీలో మళ్లీ జిల్లాల వివాదం.. రాయలసీమలో కొత్త డిమాండ్లు ఏంటి, సర్కార్ ప్లాన్ ఏంటి..
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతులకు ఇచ్చే పాసు పుస్తకాలపై వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి బొమ్మలతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. దీనిపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఇచ్చిన 21.86లక్షల భూహక్కు పత్రాలు (బీహెచ్‌పీ) స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు (పీపీబీ) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.22.50 కోట్లు విడుదల చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఇచ్చేందుకు కొత్త పాసు పుస్తకాలు సిద్ధమైనప్పటికీ.. పంపిణీ కార్యక్రమం గత ఎనిమిది నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్న విషయం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ముద్రణ పూర్తయిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందించాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో.. జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామ సభలు నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు.
