IND W vs SL W: అదరగొట్టిన అమ్మాయిలు.. దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కీలక కామెంట్స్..

IND W vs SL W : ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టీ20 మ్యాచ్ శుక్రవారం తిరువనంతపురంలో జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత మహిళల

IND W vs SL W: అదరగొట్టిన అమ్మాయిలు.. దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కీలక కామెంట్స్..

IND W vs SL W

Updated On : December 27, 2025 / 8:00 AM IST

IND W vs SL W : టీమిండియా మహిళా ప్లేయర్లు అదరగొట్టారు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించారు. దీంతో శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్లుకు ఎదురే‌లేకుండా పోయింది. హ్యాట్రిక్ విజయంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో హర్మన్‌ప్రీత్ సేన కైవసం చేసుకుంది.

Also Read : Vijay Hazare Trophy : కొట్టుడే కొట్టుడు.. మైదానంలో రింకూ సింగ్ రచ్చరచ్చ.. మెరుపు సెంచరీతో అదరగొట్టావ్ భయ్యా..

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టీ20 మ్యాచ్ శుక్రవారం తిరువనంతపురంలో జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. భారత మహిళా జట్టు పేసర్ రేణుక సింగ్, సిన్నర్ దీప్తి శర్మ అద్భుత బౌలింగ్ తో శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో రేణుక సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో దీప్తి శర్మ వరల్డ్ రికార్డును నమోదు చేసింది.


స్వల్ప పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత మహిళల జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన (1) వెంటనే ఔట్ అయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన జెమీమా (9) కూడా వెంటనే పెవిలియన్ బాటపట్టింది. దీంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (21 నాటౌట్) తో కలిసి షెపాలీ వర్మ (79 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చింది. 13.2 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి భారత మహిళా జట్టు 115 పరుగులు చేసింది.


మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ.. మా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. బౌలర్ల ప్రదర్శన ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది. టీ20ల్లో బౌలింగ్ చాలా కీలకం. ఈ సిరీస్‌లో భారత్ జట్టు విజయంలో బౌలర్ల పాత్ర ఎంతో కీలకం. ఇది మాకు గొప్ప సిరీస్. ప్రపంచ కప్ విజయం తరువాత మేము మా ఆటతీరు ఎలా ఉండాలన్నదానిపై చర్చించుకున్నాం. టీ20ల్లో మరింత దూకుడుగా ఆడాలని మేము ముందే నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ ఫార్మాట్లో తర్వాతి ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. మొత్తానికి మా జట్టు ప్రదర్శన అన్ని విభాగాల్లోనూ సంతృప్తిగా ఉందని హర్మన్ ప్రీత్ అన్నారు.


దీప్తి వరల్డ్ రికార్డు..
శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు స్పిన్ బౌలర్ దీప్తి శర్మ అదరగొట్టింది. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేసర్ మెగాన్ షట్ (151)ను దీప్తి శర్మ సమం చేసింది. తద్వారా వరల్డ్ రికార్డు నమోదు చేసింది. దీప్తి శర్మ 131 మ్యాచ్ లలో 18.73 సగటుతో 151 వికెట్లు తీసింది. అయితే మెగాన్ షట్ కంటే దీప్తి శర్మ ఎనిమిది మ్యాచ్ లు ఎక్కువగా ఆడింది. మొత్తంగా మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో దీప్తి (333) మూడో స్థానంలో ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్ ముగిసేలోపు ఆమె రెండో స్థానానికి చేరుకొనే అవకాశం ఉంది.