రుస్సో బ్రదర్స్ ‘ది గ్రే మ్యాన్’ హాలీవుడ్ మూవీలో ధనుష్‌..

రుస్సో బ్రదర్స్ ‘ది గ్రే మ్యాన్’ హాలీవుడ్ మూవీలో ధనుష్‌..

Dhanush Cast in Russo Brothers The Gray Man : ప్రపంచ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ వంటి మార్వెల్ ప్రధాన బ్లాక్ బస్టర్లకు దర్శకత్వం వహించిన హాలీవుడ్ డైరెక్టర్లు జో రుస్సో ఆంథోనీ రుస్సో బ్రదర్స్ మరో బిగ్ ప్రాజెక్టు మూవీతో ముందుకు వస్తున్నారు. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లో ‘ది గ్రే మ్యాన్’ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. రస్సో బ్రదర్స్ నిర్మించే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో తమిళ నటుడు ధనుష్‌కు చోటు దక్కింది.

ప్రముఖ హాలీవుడ్ తారలతో కలిసి ధనుష్ నటించనున్నట్టు నెట్ ఫ్లిక్స్ ట్వీట్ ద్వారా ప్రకటించింది. ధనుష్ ఏ పాత్ర పోషిస్తారో, ఆ పాత్ర ఎంత ముఖ్యమో ఇంకా క్లారిటీ లేదు. ‘గ్రే మ్యాన్’ మూవీతో ధనుష్ కు రెండవ అంతర్జాతీయ ప్రాజెక్టు. గతంలో కెన్ స్కాట్ దర్శకత్వం వహించిన ఫకీర్ (2018) మూవీలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించాడు.

The Gray Man

‘ది గ్రే మ్యాన్’ మూవీలో ధనుష్‌తో పాటు ఇతర హాలీవుడ్ ప్రముఖ నటుల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి జెస్సికా హెన్విక్, నార్గోస్ నుంచి వాగ్నెర్ మౌరా వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’ లో నటించిన చైల్డ్ స్టార్ జూలియా బట్టర్స్ కూడా నటిస్తున్నారు.


ఈ మూవీ ప్రీమియర్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.మాజీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ హంతకుడైన కోర్ట్ జెంట్రీ గురించి Mark Greaney మొదటి సిరీస్ ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.

ఇందులో నటుడు ర్యాన్ గోస్లింగ్.. జెంట్రీ పాత్రను పోషించనున్నాడు.  గ్రే మ్యాన్ మూవీ.. నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో అతిపెద్ద బడ్జెట్ మూవీగా రాబోతోంది. ఆంథోనీ జో రస్సో నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీల్లో అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ (2018), ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ (2019) సహా నాలుగు మార్వెల్ సూపర్ హీరో చిత్రాలు ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాయి.