‘సారంగ దరియా’ వివాదం గురించి క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల..

‘సారంగ దరియా’ వివాదం గురించి క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల..

Saranga Dariya song Controversy: ‘సారంగ దరియా’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఈ పాటే.. పిల్లలనుండి పండు ముసలి వరకు అందరూ ఈ జానపద గేయానికి ఫిదా అయిపోయారు.. ఇప్పటికీ యూట్యూబ్‌ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది ‘సారంగ దరియా’..

‘సారంగదరియా’.. సాయి పల్లవికి మరో 100 మిలియన్ల సాంగ్..

ఈ పాట ఎంత త్వరగా పాపులర్ అయిందో అంతే త్వరగా వివాదల్లో చిక్కుకుంది. ఈ పాట నేనే పాడానంటూ కోమలి మీడియా ముందు బాధపడుతూ చెప్పింది. ఇన్ని రోజులు పని బిజీలో ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా ఈ వివాదం గురించి క్లారిటీ ఇస్తూ ఫేస్‌బుక్‌లో వివరంగా పోస్ట్ చేశారు.

‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో ఈ పాట విన్నప్పటినుండి సినిమాలో పెట్టే వరకు, సుద్దాల గారి నుండి కోమలిని కాంటాక్ట్ చేసే వరకు జరిగిన పరిణామాలు, అలాగే కోమలిని కాదని మంగ్లీ చేత ఈ పాట పాడించడానికి గల పరిస్థితులు, కారణాలను వివరించారు శేఖర్ కమ్ముల.

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరీ’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.