Divi Vadthya : చిరంజీవి కారు దిగి వచ్చి మా అమ్మ నాన్నలకి ఫోటో ఇచ్చారు..

దివి మాట్లాడుతూ.. ''బిగ్‌బాస్‌ ముందు 100 కి పైగానే ఆడిషన్స్ ఇచ్చాను. కానీ అందరు రిజెక్ట్ చేశారు. బిగ్‌బాస్‌ నాకు బాగా ఉపయోగపడింది. బిగ్‌బాస్‌ తర్వాత నాకు మంచి అవకాశాలు వచ్చాయి. చిరు సర్ బిగ్‌బాస్‌ లో నాకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పి గాడ్ ఫాదర్ లో...........

Divi Vadthya : చిరంజీవి కారు దిగి వచ్చి మా అమ్మ నాన్నలకి ఫోటో ఇచ్చారు..

Divi Vadthya shares her experience with chiranjeevi while god father shooting

Updated On : October 10, 2022 / 8:28 AM IST

Divi Vadthya :  ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టినా దివి కొన్ని సినిమాలు చేసినా అంతగా పేరు రాలేదు బిగ్ బాస్ లో పాల్గొన తర్వాత బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత దివి వరుసగా ఆఫర్స్ చేజిక్కించుకుంటుంది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చిరంజీవి దివికి సినిమాలో అవకాశం ఇస్తాను అని మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టే గాడ్ ఫాదర్ సినిమాలో అవకాశం ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఈ విషయంలో దివి ఫుల్ హ్యాపీగా ఉంది.

గాడ్ ఫాదర్ సినిమాలో ఒక డీ గ్లామర్ రోల్ లో నటించి అందర్నీ మెప్పించింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉంది దివి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దివి చిరంజీవితో జరిగిన కొన్ని సంఘటనలని షేర్ చేసుకుంది.

దివి మాట్లాడుతూ.. ”బిగ్‌బాస్‌ ముందు 100 కి పైగానే ఆడిషన్స్ ఇచ్చాను. కానీ అందరు రిజెక్ట్ చేశారు. బిగ్‌బాస్‌ నాకు బాగా ఉపయోగపడింది. బిగ్‌బాస్‌ తర్వాత నాకు మంచి అవకాశాలు వచ్చాయి. చిరు సర్ బిగ్‌బాస్‌ లో నాకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పి గాడ్ ఫాదర్ లో ఛాన్స్ ఇచ్చి అయన మాట నిలబెట్టుకున్నారు. చిరు సర్ సినిమాలో కీ రోల్ చేయడం నా అదృష్టం. చిరంజీవి అంత పెద్ద స్టార్ అయి ఉండి చిన్న, పెద్ద అని లేకుండా అందర్నీ ఒకేలా చూస్తారు.”

Prince Trailer : ఇండియా అబ్బాయి-బ్రిటిష్ అమ్మాయి లవ్ స్టోరీ.. జాతిరత్నాలు డైరెక్టర్ ‘ప్రిన్స్’ ట్రైలర్ చూశారా??

”ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవితో ఫోటో కోసం మా అమ్మ నాన్న నాతో పాటు ఊటీ వచ్చారు. రోజూ సెట్స్ కి వచ్చేవారు. నేను చిరు సర్ ని అడగాలని మొహమాటంగా ఉండేది. ఒకరోజు మొహమాటంగానే చిరు సర్ ని అడిగాను. దీంతో సెట్స్ లో మా అమ్మ నాన్నని చూసి ఆయన వెంటనే కార్ లోంచి దిగి వచ్చి వాళ్ళకి ఫోటో ఇచ్చారు. ఆ రోజు నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆ తర్వాత మా అమ్మ నాన్నల కోసం ఆయన ఫుడ్ బాక్స్ ని పంపించారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు” అని తెలిపింది.